
సినిమా థియేటర్స్ (cinema theatres)
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. తాజాగా కేంద్రం థియేటర్స్ విషయంలో సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే.. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తెలియజేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్, మల్టీప్టెక్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. కరోనా కారణంగా కేంద్రం గతేడాది మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా థియేటర్స్ , మల్టీప్లెక్స్ మూతపడ్డాయి. దాంతో పాటు షూటింగులు ఆగిపోయాయి. ఐతే.. కేంద్రం ప్రతి రంగంలో ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాలు 50 శాతం ఆక్యుపెన్షీతో ప్రేక్షకులను థియేటర్స్ వైపు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. దీంతో మిగతా హీరోలు, నిర్మాతలకు మంచి కంటెంట్ ఉండే.. సినిమాలు చూడటానికి ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారన్న విషయం స్పష్టం అయింది.
తాజాగా కేంద్రం థియేటర్స్‌లలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. గతంలో కంటే ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్స్, మల్టీప్లెక్స్‌లలో అనుమతించేలా పర్మిషన్ ఇచ్చింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరోవైపు స్మిమ్మింగ్ ఫూల్స్‌లలో గతంలో ఉన్న 50 శాతం ఆక్యుపెన్షీని 100 శాతంతో నడిపించుకోవచ్చని మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాక పర్మిషన్స్ ఇచ్చింది. మరోవైపు ఇంటర్ స్టేట్లలో మనుషులు, వస్తువులు రవాణాపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 27, 2021, 21:03 IST