Home /News /movies /

CENTRE DECISION ON LOCKDOWN5 GIVES BIG SHOCK TO TOLLYWOOD AK

కేంద్రం నిర్ణయం... దిక్కుతోచని స్థితిలో టాలీవుడ్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సినిమా ధియేటర్ల మూసి ఉంచాలని కేంద్రం నిర్ణయించడం టాలీవుడ్‌కు ఊహించని షాక్‌గా మారింది.

    లాక్‌డౌన్ 5‌లో భాగంగా అనేక సడలింపులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... సినీ ఇండస్ట్రీకి మాత్రం భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం ధియేటర్లు తెరిచేందుకు అనుమతి ఇస్తే... లాక్‌డౌన్ రూల్స్ పాటిస్తూ తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధం కావాలని ఎగ్జిబిటర్లు భావించారు. కానీ కేంద్రం మాత్రం ధియేటర్లను అనుమతించే విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోలేదు. అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైల్ సర్వీసులు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్క్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు వంటి వాటికి నో పర్మిషన్ అనేసిన కేంద్రం... ఈ జాబితాలో సినిమా ధియేటర్లను కూడా చేర్చడం సినీ రంగాన్ని తీవ్ర నిరాశకు గురి చేసింది.

    లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ధియేటర్లు తెరుచుకునేందుకు కూడా అనుమతి వస్తుందని టాలీవుడ్ పెద్దలు భావించారు. కేంద్రం అనుమతి ఇస్తే... ఎలాగోలా రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ధియేటర్లను తెరిపించుకోవాలని అనుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పడంతో... కేంద్రం తీసుకునే నిర్ణయం వైపు ఆశగా ఎదురుచూశారు. కానీ లాక్‌డౌన్ 5లో మూసి ఉంచే వాటిని జాబితాలో ధియేటర్ల కూడా ఉండటం టాలీవుడ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. దీనికితోడు సినిమా, సీరియల్ షూటింగ్స్‌కు అనుమతి ఇచ్చే విషయంలోనూ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనట్టు కనిపిస్తోంది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల్లో వీటి ప్రస్తావన లేకపోవడంతో... షూటింగ్స్ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుందనే అంశంపై సస్పెన్స్ నెలకొంది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Lockdown relaxations, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు