HOME »NEWS »MOVIE »centre announced padma vibhushan award to singer bala subrahmanyam in tamilnadu quota ns

Bala Subrahmanyam: ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్ అవార్డు.. తమిళనాడు కోటాలో ప్రకటించిన కేంద్రం

Bala Subrahmanyam: ఎస్పీ బాలుకు పద్మ విభూషణ్ అవార్డు.. తమిళనాడు కోటాలో ప్రకటించిన కేంద్రం
SP బాలసుబ్రమణ్యం:

గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది.

  • Share this:
    గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యానికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు పద్మ విభూషణ్‌ అవార్డును కేంద్రం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. అయితే బాల సుబ్రమణ్యానికి తమిళనాడు కోటాలో అవార్డును అందించింది. భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను సోమవారం కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాదికి గాను పద్మ విభూషణ్‌-7 , పద్మభూషణ్‌-10 , పద్మ శ్రీ-102  ఇలా మొత్తం 119  మంది వివిధ రంగాలకు చెందిన వారు పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. మరో ప్రముఖ గాయిని కే.ఎస్ చిత్రకు ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

    తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణలో ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఏపీకి చెందిన అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ (Arts), ఏపీకి కి చెందిన అసవాది ప్రకాశ్‌రావుకు పద్మశ్రీ (literature), ఏపీకి చెందిన నిడుమోలు సుమతికి పద్మశ్రీ (Arts), తెలంగాణకు చెందిన కనకరాజుకు పద్మశ్రీ(Arts) పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.



    కేంద్ర మాజీ మంత్రి రాం విలాస్ పాశ్వాన్‌, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌, మాజీ లోక్ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్, గుజరాత్‌ బీజేపీ నేత కేశూభాయ్‌ కు కేంద్రం పద్మభూషణ్‌ ప్రకటించింది. వీరితో పాటు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మ విభూషణ్ ను కేంద్రం ప్రకటించింది. కర్ణాటకకు చెందిన డాక్టర్ మొనప్ప హెగ్డేకు, అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీకి, ఢిల్లీకి చెందిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్‌కు, బీబీ లాల్‌కు, ఒడిశాకు చెందిన సుదర్శన్ సాహూకు తదితరులకు పద్మ విభూషణ్ ప్రకటించారు.
    Published by:Nikhil Kumar S
    First published:January 25, 2021, 21:30 IST