Pooja Hegde: పూజా హెగ్డేకు కేంద్ర మంత్రి ప్రచారం..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్‌ ఫాంలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ భామ బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

news18-telugu
Updated: October 17, 2019, 2:08 PM IST
Pooja Hegde: పూజా హెగ్డేకు కేంద్ర మంత్రి ప్రచారం..
Instagram/hegdepooja
news18-telugu
Updated: October 17, 2019, 2:08 PM IST
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫుల్‌ ఫాంలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈ భామ బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ భామ నటించిన బాలీవుడ్ మూవీ 'హౌస్‌ ఫుల్‌ 4' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న పూజా నటిస్తున్న ఈ సినిమాకి ఏకంగా రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రచారం కల్పించారు. వివరాలలోకి వెళితే .. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్‌టైనర్.. 'హౌస్‌ఫుల్ 4'.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, నడియాడ్ వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నాడు.




హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో వస్తున్న నాలుగో సినిమా ఇది.  ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా.. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ 'హౌస్‌ఫుల్ 4' ఎక్స్‌ప్రెస్ అనే కొత్త రైలును ప్రవేశపెట్టారు. ఇక నుంచి ఈ రైలులో నటీనటులు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవచ్చని ఆయన ప్రకటించారు. ఈ రకంగా రైల్వే శాఖ ప్రయాణికులకు మరింత చేరువవుతుందని గోయల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి 'ప్రమోషన్స్ ఆన్ వీల్స్' అనే పేరు  పెట్టారు. కాగా 16, 17 తేదీల్లో ముంబయి నుంచి దిల్లీ వెళ్లే రైలులో హౌస్‌ఫుల్ 4 చిత్రబృందం ప్రయాణించనుందని దీని ద్వారా వారు తమ సినిమా ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చని గోయల్ ట్విటర్ వేదికగా ఆయన ప్రకటించారు. నిన్న 'హౌస్‌ఫుల్ 4' టీం దిల్లీ నుంచి ముంబయి వరకు ఈ రైలులో ప్రయాణించింది. ఈరోజు మళ్లీ ముంబయి నుంచి దిల్లీకి తిరిగి ప్రయాణించనుంది. రైలులో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేసిన వీడియోను అక్షయ్, పూజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఈ స్కీంను వాడుకున్న తొలి చిత్రబృందం 'హౌస్‌ఫుల్ 4' కావడం విశేషం.
Loading...
First published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...