హోమ్ /వార్తలు /సినిమా /

Cinema Theatres - Central government: సినీ ల‌వ‌ర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆనందంలో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌

Cinema Theatres - Central government: సినీ ల‌వ‌ర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆనందంలో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్‌

4. సింగిల్‌ థియేటర్లలో రిక్లైనర్‌ సీట్స్‌ ఉంటే గరిష్ఠంగా రూ.200+GST.. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300+GST

4. సింగిల్‌ థియేటర్లలో రిక్లైనర్‌ సీట్స్‌ ఉంటే గరిష్ఠంగా రూ.200+GST.. మల్టీప్లెక్స్‌లో రిక్లైనర్స్‌కు గరిష్ఠంగా రూ.300+GST

Cinema Theatres - Central government:కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు సినీ రంగంపై మ‌రింత క‌రుణ చూపింది. కోవిడ్ నేప‌థ్యంలో మూత ప‌డ్డ సినిమా థియేట‌ర్స్‌ను ఇటీవ‌లే కొన్ని ప‌రిమితులతో ఓపెన్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకుంది. .........................................

ఇంకా చదవండి ...

  కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు సినీ రంగంపై మ‌రింత క‌రుణ చూపింది. కోవిడ్ నేప‌థ్యంలో మూత ప‌డ్డ సినిమా థియేట‌ర్స్‌ను ఇటీవ‌లే కొన్ని ప‌రిమితులతో ఓపెన్ చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకుంది. అందులో ముఖ్యంగా యాబై శాతం సీటింగ్ కెపాసిటీ ఉండాల‌నే నిబంధ‌న‌ను విధించింది. సంక్రాంతి పండుగ సీజ‌న్‌లో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ కేంద్ర ప్ర‌భుత్వానికి పూర్తి సీటింగ్ కెపాసిటీ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేసినా, రాష్ట్ర ముఖ్య‌మంత్రులు ప్రత్యేకంగా వంద శాతం థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసుకోమ‌ని చెప్పినా కేంద్ర ప్ర‌భుత్వం ఒప్పుకోలేదు. దాదాపు నెల‌న్న‌ర రోజుల త‌ర్వాత ఇప్పుడు మ‌రోసారి కేంద్రం ప‌రిస్థితుల‌ను స‌మీక్షించింది. ఇప్పుడు అధిక‌ శాతం ఆక్యుపెన్సీతో సినీ థియేట‌ర్స్‌ను ఓపెన్ చేసుకోవ‌చ్చున‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలియ‌జేసింది.

  అయితే ఎంత శాతంతో థియేట‌ర్స్ బుక్ చేసుకోవ‌చ్చున‌నే సంగ‌తిని మాత్రం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు. ఫిబ్ర‌వ‌రి 1 నుంచి థియేట‌ర్స్ య‌జమాన్యం అధిక శాతంతో థియేట‌ర్స్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించవ‌చ్చును. ఇది ఓ ర‌కంగా నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్స్, మ‌ల్టీప్లెక్స్‌ల‌కు మంచి ప‌రిణామంగానే చెప్ప‌వ‌చ్చు.

  ఇప్పుడిప్పుడే సినీ రంగంలో సినిమాల‌ను విడుద‌ల చేయ‌డం ఎక్కువైంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఇలాటి నిర్ణ‌యం తీసుకోవ‌డం హ‌ర్ష‌నీయం. కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌టి దఫానే పూర్త‌య్యింది. మ‌రో ద‌ఫా పూర్త‌యితే సినిమాల్లోకి ప్రేక్ష‌కుల రాక మ‌రింత పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

  Published by:Anil
  First published:

  Tags: Central Government, Theatres, Tollywood Cinema

  ఉత్తమ కథలు