Vijay - Central government: హీరో విజయ్‌కి కేంద్రం షాక్‌.. థియేటర్స్‌ విషయంలో కేంద్ర నిర్ణయంపై నిరుత్సాహం

Central Govenment Shocks Tamil Nadu Government and Hero Vijay Master

Vijay - Central government: హీరో విజయ్‌ నటించిన మాస్టర్‌ సినిమా వంద శాతం ఆక్యుపెన్సీతో విడుదల చేసుకోవచ్చునని తమిళనాడు ప్రభుత్వం తెలియజేసిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం.. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టింది.. అసలేం జరిగిందంటే...

  • Share this:
    కోలీవుడ్ అగ్ర కథానాయకుడు విజయ్‌ హీరోగా నటించిన చిత్రం 'మాస్టర్‌'. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. అందుకు తగినట్లు తమిళనాడు ప్రభుత్వం కూడా థియేటర్స్‌ విషయంలో నిర్మాతలకు వెసులుబాటును కల్పించింది. నిజానికి కేంద్రం థియేటర్స్‌ను ఓపెన్‌ చేసుకునే విషయంలో యాబై శాతం ఆక్యుపెన్సీతో పర్మిసన్‌ ఇచ్చింది. అయితే అందుకు భిన్నంగా తమిళనాడు ప్రభుత్వం విజయ్‌ 'మాస్టర్' సినిమాకు వంద శాతం పర్మిషన్స్‌ ఇచ్చింది. దీంతో తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సంతోషపడ్డారు. థియేటర్‌కు రావడానికి ప్రేక్షకుడు భయపడుతున్న ఈ తరుణంలో స్టార్‌ హీరో సినిమాకు ఇలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే విజయ్‌ అభిమానులకు, కోలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ సహా నిర్మాతలకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.

    తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన 100 శాతం ఆక్యుపెన్సీని ఉపసంహరించుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో జన సమ్మర్థం ఎక్కువగా ఉండే థియేటర్స్‌ను దాదాపు ఆరేడు నెలలు మూసేశారు. ఈ మధ్యనే యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్‌ చేసుకోవడంతో ప్రతి షో విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆదేశాలు జారీ చేశాయి. అంతా బావుందనుకుంటున్న సమయంలో నిర్మాతల స్పీడుకు బ్రేకులేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

    hero vijay, kollywood, kollywood star vijay, thalapathy vijay, vijay master, vijay new movie master, master movie update, central shocks vijay, మాస్టర్‌, హీరో విజయ్‌, కేంద్ర ప్రభుత్వం
    Central Govenment Shocks Tamil Nadu Government and Hero Vijay Master


    విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం మాస్టర్. సినిమా ఎప్పుడో విడుదలకు సిద్ధమైనా కోవిడ్‌ కారణంగా థియేటర్స్‌లోకి రాలేదు. ఎట్టకేలకు థియేటర్స్‌లోకి వచ్చే క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విజయ్‌ ఫ్యాన్స్‌ నిరుత్సాహ పడుతున్నారు.
    Published by:Anil
    First published: