‘సైరా నరసింహా రెడ్డి’కి సెన్సార్ చిక్కులు.. రంగంలోకి తెలంగాణ హై కోర్ట్..

ముందు నుంచి కూడా సైరా నరసింహా రెడ్డి సినిమా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది తమ వీరుడి చరిత్ర అంటూ వంశస్తులు చిరు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 26, 2019, 3:59 PM IST
‘సైరా నరసింహా రెడ్డి’కి సెన్సార్ చిక్కులు.. రంగంలోకి తెలంగాణ హై కోర్ట్..
సైరా పోస్టర్
  • Share this:
ముందు నుంచి కూడా సైరా నరసింహా రెడ్డి సినిమా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది తమ వీరుడి చరిత్ర అంటూ వంశస్తులు చిరు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తమకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టారు. దానికోసమే తెలంగాణ కోర్టును కూడా ఆశ్రయించారు వాళ్లు. ఇక ఈ సినిమాకు సెన్సార్ పూర్తి చేసినా కూడా ఇప్పటి వరకు సర్టిఫికేట్ మాత్రం ఇవ్వలేదు సెన్సార్ బోర్డ్. ఇక ఇప్పుడు సైరాకు అనుకోని చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నాయి. విడుదల మరో వారం రోజులు ఉందనగా ఇప్పుడు తెలంగాణ హై కోర్ట్ ఈ సినిమా కేసును తీసుకుంది.
Censor Issues for Chiranjeevi Mega movie Sye Raa Narasimha Reddy and Telangana High Court shocks unit pk ముందు నుంచి కూడా సైరా నరసింహా రెడ్డి సినిమా చుట్టూ వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇది తమ వీరుడి చరిత్ర అంటూ వంశస్తులు చిరు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. sye raa,sye raa controvesy,sye raa movie twitter,sye raa movie release date,sye raa narasimha reddy movie,sye raa censor,sye raa movie censor date,telugu cinema,ram charan chiranjeevi,telangana high court,సైరా,సైరా సెన్సార్ సర్టిఫికేట్,సైరా సెన్సార్ పూర్తి,తెలంగాణ హై కోర్ట్ సైరా సినిమా,తెలుగు సినిమా,రామ్ చరణ్ చిరంజీవి
‘సైరా’ సినిమాను విడుదల ఆపు చేయాలని హైకోర్టులో పిటిషన్ (File/Photos)

ఈ సినిమాకు ఇంకా సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదని కోర్టుకు తెలిపింది సెన్సార్ బోర్డ్. తమకు సెప్టెంబర్ 30 వరకు సమయం కావాలని కోరుకుంది సెన్సార్ బోర్డ్. ఆ లోపు తమ నిర్ణయం చెప్తామన్నారు వాళ్లు. ఇక నిర్మాత రామ్ చరణ్ కూడా తన జాగ్రత్తల్లో తాను ఉన్నాడు. ఈ సినిమా ఉయ్యాలవాడ బయోపిక్ కాదని సెన్సార్ సభ్యులకు చెప్పాడు. ఇక దర్శకుడు కూడా ఇదే మాట కోర్టుకు విన్నవించాడు. ఈ విషయంపై కోర్టు తన నిర్ణయాన్ని తెలపనుంది. సెప్టెంబర్ 30న హై కోర్ట్ ఈ కేస్ వాయిదా వేసింది. మొత్తానికి చూడాలిక.. సైరా ఈ చిక్కుల నుంచి ఎలా తప్పించుకోనుందో..?

First published: September 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు