కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు మరో షాక్.. వర్మకు తప్పట్లేదు..

నాకు గిల్లడం ఇష్టం.. గిల్లించుకోండి అంతే అంటున్నాడు వర్మ. ఇప్పుడు ఆయన్ని సెన్సార్ బోర్డ్ కూడా బాగానే గిల్లుతుంది. ఈయన తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా నిజానికి నవంబర్ 29న విడుదల కావాల్సింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 30, 2019, 9:03 PM IST
కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు మరో షాక్.. వర్మకు తప్పట్లేదు..
రామ్ గోపాల్ వర్మ twitter
  • Share this:
నాకు గిల్లడం ఇష్టం.. గిల్లించుకోండి అంతే అంటున్నాడు వర్మ. ఇప్పుడు ఆయన్ని సెన్సార్ బోర్డ్ కూడా బాగానే గిల్లుతుంది. ఈయన తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా నిజానికి నవంబర్ 29న విడుదల కావాల్సింది. కానీ కాలేదు.. దానికి కారణం వివాదం. ఈ సినిమాకు కోర్టు కూడా చుక్కలు చూపిస్తుంది. వర్మ చేస్తున్న ఈ కాంట్రవర్సియల్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచే కాదు.. కోర్టు నుంచి కూడా వరస షాకులు తగులుతున్నాయి. ఎందుకో తెలియదు కానీ గత ఏడాది కాలంగా తెలుగుదేశంపై చాలా గుర్రుగా ఉన్నాడు వర్మ. కావాలనే వాళ్లను టార్గెట్ చేస్తున్నాడు. చంద్రబాబునాయుడుతో అయితే ఆడేసుకుంటున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు వర్మ. ఇప్పుడు కమ్మరాజ్యంలో అంటున్నాడు.

Censor Board unexpected shock to Ram Gopal Varma Kamma Rajyam lo Kadapa Reddlu movie and not issued certificate pk నాకు గిల్లడం ఇష్టం.. గిల్లించుకోండి అంతే అంటున్నాడు వర్మ. ఇప్పుడు ఆయన్ని సెన్సార్ బోర్డ్ కూడా బాగానే గిల్లుతుంది. ఈయన తెరకెక్కించిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమా నిజానికి నవంబర్ 29న విడుదల కావాల్సింది. Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu censor board,kamma rajyamlo kadapa reddlu high court pitition,kamma rajyamlo kadapa reddlu high court,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer,Kamma Rajyam Lo Kadapa Reddlu trailer 2,Kamma Rajyam Lo Kadapa Reddlu release in ap,Kamma Rajyam Lo Kadapa Reddlu movie updates,rgv Kamma Rajyam Lo Kadapa Reddlu,Kamma Rajyam Lo Kadapa Reddlu varma,Kamma Rajyam Lo Kadapa Reddlu rgv,telugu cinema,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సెన్సార్ బోర్డ్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు,కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా,కమ్మరాజ్యంలో కడపరెడ్లు బాక్సాఫీస్,కమ్మరాజ్యంలో కడపరెడ్లు వర్మ,కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఏపీలో విడుదలవుతుందా,రామ్ గోపాల్ వర్మ కమ్మరాజ్యంలో కడపరెడ్లు
Twitter/RGVzoomin


ఈ చిత్రం అనుకున్న సమయానికి రావడం కష్టంగా మారిందిప్పుడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విజయం సాధించడంతో ఇప్పుడు అదే ఉత్సాహంలో కమ్మరాజ్యంలో సినిమా చేసాడు వర్మ. ఈ సినిమాను నవంబర్ 29న రావాల్సిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ చూసినా కూడా ఇప్పటి వరకు సర్టిఫికేట్ ఇష్యూ చేయలేదు. అడిగితే రివైజింగ్ కమిటికీ వెళ్లాల్సిందిగా వర్మకు సూచించారు. ఈ సినిమా విషయంలో ఏదైనా అభ్యంతరకర సన్నివేశాలుంటే రివైజింగ్ కమిటీ చూసుకుంటుందని వర్మకు చెప్పారు సెన్సార్ సభ్యులు. దాంతో ఈయన కూడా ఇప్పుడేం చేయలేకపోతున్నాడు. వారం రోజుల తర్వాత కానీ ఈ చిత్ర భవిష్యత్తు ఏంటనేది తేలదు.


అప్పటి వరకు కమ్మరాజ్యంలో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. అయితే ఈ చిత్రంలో ఎవరినీ తక్కువ చేసి చూపించలేదని చెబుతున్నాడు ఆర్జీవీ. అసలు ఈ చిత్రం ఎలా విడుదలవుతుందో చూస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం చూస్తుంటే అసలు ఏపీలో కమ్మరాజ్యంలో అనుకున్న సమయానికి అనుకున్నట్లు విడుదలవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అప్పట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలంగాణలో విడుదలైన రెండు నెలల తర్వాత ఆంధ్రాలో విడుదలైంది.



ఇక ఇప్పుడు కమ్మరాజ్యంలో సినిమాలో టీడీపీని ఈ స్థాయిలో టార్గెట్ చేసాడు వర్మ. మరి అనుకున్నట్లుగా ఈ చిత్రాన్ని అక్కడ తెలుగు తమ్ముళ్లు విడుదల కానిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఈ చిత్రంపై తన పాత్రను అసభ్యకరంగా చూపించాలరంటూ కేఏ పాల్ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పటికీ ఈ చిత్రంపై రోజుకో రచ్చ జరుగుతూనే ఉంది. ఇదంతా చూస్తుంటే అసలు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనుకున్న సమయానికి విడుదలవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ఏ గొడవ లేకపోయినా కూడా ఏపీలో మాత్రం అనుకున్న టైమ్‌కు వస్తుందా లేదా అనేది చూడాలి.
First published: November 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>