సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి రెండు నెలలు దాటిపోయింది. అయినా కూడా ఈయన మరణంపై ఇంకా అనుమానాలు మాత్రం ఆగడం లేదు. అసలు ఈయన ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే హత్య చేసారా అంటూ అనుమానాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అభిమానులు అయితే సోషల్ మీడియాలో రోజుకో రకంగా సాక్ష్యాలు పెడుతున్నారు. అసలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదంటూ వాళ్లు చెబుతననారు. న్నారు. మరోవైపు ముంబై పోలీసులు మాత్రం ఈయన సూసైడ్ చేసుకున్నాడంటూ తేల్చేసారు.. పోస్టుమార్టం రిపోర్టులు కూడా ఇవే చెప్తున్నాయి. కానీ అదే సమయంలో ముంబై పోలీసులు సుశాంత్ .. డ్రగ్స్‌కు బానిస అయినట్టు ఆయన పనిచేసే నీరజ్ సింగ్ తమ ఇన్వెస్టిగేషన్లో చెప్పినట్టు చెప్పుకొచ్చారు.అంతేకాదు సుశాంత్.. మరణించే వరకు గంజాయ్‌తో చేసిన సిగరెట్టు తాగేవాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతని ఇంట్లో తనిఖీ చేస్తే అవి ఆ సిగరెట్లు ఏవి కనబడలేదన్నారు. నీరజ్ సింగ్.. సుశాంత్ ఇంట్లో గతేడాది ఏప్రిల్ నుంచి పనిచేస్తున్నాడు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
ఈ కేసులో ముంబై పోలీసులు సుశాంత్‌ను బ్యాడ్ చేయాలనే ఉద్దేశ్యంతో నీరజ్ సింగ్‌తో ఈ స్టేట్మెంట్ ఇప్పించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక నీరజ్ సింగ్..సుశాంత్ సింగ్ ఇంట్లో ఇంటిని తుడవడం, కుక్కను వ్యాహ్యాలీ తిప్పడం వంటివి చేసేవాడని ముంబై పోలీసులు తెలిపారు. అంతేకాదు సుశాంత్ కోసం సిద్ధార్ధ్ పితాని, రజత్ మేవాతీ, శామ్యూల్ మిరిండాతో పాటు మరికొందరు ఆయన కోసం పనిచేసేవారని ముంబై పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నీరజ్ సింగ్ వెల్లడించినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయే కొద్ది రోజుల ముందు సుశాంత్ కాస్తంత అనారోగ్యం పాలైనట్టు చెప్పాడు. మొత్తంగా ముంబై పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు తేల్చారు. మరోవైపు సీబీఐ ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబర్తిని విచారిస్తున్నారు. మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగి సుశాంత్ చనిపోయే ముందు వరకు ఎవరికీ ఎంతెంత నగదు బదిలీ చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి సుశాంత్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు సుశాంత్‌ను విలన్‌గా చూపించాలనే ప్రయత్నం చేస్తుంటే.. సీబీఐ మాత్రం సుశాంత్ ఆత్మహత్య వెనక ఉన్న అసలు నిజాలను బయటపెట్టే ప్రయత్నంలో ఉంది. మొత్తానికి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు పూటకో మలుపు తిరుగుతోంది.