హద్దులు దాటిన ఆలియా, రణ్‌వీర్‌.. అందుకే ఆ సీన్ తీసేశారా ?

గల్లీబాయ్‌లో ముద్దు సీన్

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌లో ముద్దు సీన్‌ను చూపించడం ద్వారా ఆసక్తిని పెంచారు. అయితే సెన్సార్ బోర్డు ముద్దు సీన్‌పై సీరియస్ అయ్యింది

  • Share this:
రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ కలిసి నటిస్తున్న గల్లీ బాయ్ సినిమా ప్రేమికులరోజు రిలీజ్‌కు రెడీ అయ్యింది. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 14 గురువారం ఈ మూవీ తెరపైకి రానుంది. దీనికోసం ఈ సినిమా సెన్సార్‌ కూడా పూర్తి చేసుకుంది. అయితే గల్లీబాయ్‌కు సెన్సార్ బోర్డు బాగానే కత్తెర్లు వేసింది. ముఖ్యంగా రణ్‌వీర్ అలియాలో ముద్దు సీన్‌ను డిలీట్ చేసింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌లో ముద్దు సీన్‌ను చూపించడం ద్వారా ఆసక్తిని పెంచారు. అయితే సెన్సార్ బోర్డు ముద్దు సీన్‌పై సీరియస్ అయ్యింది. దాంతో 13 సెకండ్ల కిస్సింగ్ సీన్‌ను డిలీట్ చేసింది. అంతేకాదు గల్లీబాయ్‌లో వాడిన బూతుపదాల్ని కూడా కట్ చేసింది.

ముంబైలో ఓ మురికివాడలో ఉండే యువకుడు రాపర్ కావాలని తపనపడే కథాంశంతో డైరెక్టర్ జోయా అక్తర్ సినిమాను నిర్మించారు. సహజంగా ఉండటం కోసం ఇందులో చెప్పడానికి వీల్లేని పచ్చి బూతులు వాడారు. అయితే వాటన్నింటినీ బీప్ చేయాలని లేదా వేరే పదాలతో రీప్లేస్ చేయాలని సెన్సార్ బోర్డు సూచించడం జరిగింది. అలాగే బ్రాండ్ పార్ట్‌నర్‌గా పెట్టిన ప్రముఖ లిక్కర్ కంపెనీ లోగో కూడా తీసివేయాలని ఆదేశించారు. చివరిగా దీనికి యు/ఎ సర్టిఫికెట్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముగిసిపోయిన ఆలియా, రణ్వీర్ వివిధ కార్యక్రమాలకు హాజరై ప్రజల్లో హైప్ క్రియేట్ చేశారు.

రణ్‌వీర్ సింగ్, ఆలియా గల్లీ బాయ్ ట్రైలర్:

First published: