Bhavai Vs CBFC : ప్రతీక్ గాంధీ ముఖ్య పాత్రలో నటించిన ‘భవాయ్’ (Bhavai) చిత్ర టైటిల్ మార్పుపై సెన్సార్ బోర్డ్ సీరియస్ అయింది. ఒకసారి సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భవాయ్’ చిత్రం .. యూట్యూబ్‌లో టైటిల్ మార్పుపై కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతేకాదు సెన్సార్ బోర్డ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా యూబ్యూట్‌లో విడుదల చేసిన ట్రైలర్లో టైటిల్లో ‘భవాయ్’ పేరుకు బదులు ‘రావన్ లీలా’ అంటూ మార్పు చేయడంపై తీవ్రంగా ఆక్షేపించారు. అంతేకాదు చిత్ర నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై సినిమాటోగ్రఫీ నియమ నిబంధనలకు అనుగుణంగా వారిపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోకూడదో అంటూ లేఖ రాసారు. టైటిల్ మార్పు పై సెన్సార్ బోర్డ్ వ్యక్తం చేస్తోన్నఈ విషయం ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఏమైనా ఒకసారి ఒక టైటిల్‌తో సినిమా సెన్సార్‌కు వెళ్లినపుడు అదే టైటిల్‌తో విడుదల చేయాలి. ఒకవేళ టైటిల్ మార్పు చేయాలంటే అది కూడా ఒక అక్షరం ఛేంజ్ చేయాలన్న మరోసారి సెన్సార్ బోర్డ్‌కు దరఖాస్తు చేసుకోవాలి.వాళ్లు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే టైటిల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలి.
Prema Nagar@50Years : అక్కినేని, వాణిశ్రీల ‘ప్రేమనగర్’కు 50 యేళ్లు పూర్తి.. తెర వెనక కథ..
కానీ ’భవాయ్’ చిత్ర నిర్మాతలు మాత్రం ముందుగా ‘భవాయ్’ టైటిల్‌తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సర్టిఫికేట్ తీసుకున్నాకా.. ఇపుడు ఆ టైటిల్‌తో కాకుండా.. ‘రావణ్ లీలా’ అంటూ యూట్యూబ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు. అంతేకాదు ఈ టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందని కేంద్ర సెన్సార్ బోర్డ్ పేర్కొంది. ఇది ఒక రకంగా కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించడమే అంటున్నారు. దీనిపై కేంద్ర సెన్సార్ బోర్డ్ చిత్ర నిర్మాతలను వివరణ కోరింది. దీనిపై చిత్ర నిర్మాతల ఏం సమాధానం ఇస్తారనే దానిపై సెన్సార్ బోర్డ్ నిర్ణయం ఆధారపడి ఉంది.
Love Story Movie Review : నాగ చైతన్య, సాయి పల్లవిల ’లవ్ స్టోరీ’ మూవీ రివ్యూ.. ఎమోషనల్ లవ్ డ్రామా..
‘భవాయ్’ చిత్ర టైటిల్ మార్పుపై కేంద్ర సెన్సార్ బోర్డ్ చైర్మన్ ప్రసూన్ జోషి న్యూస్18తో మాట్లాడుతూ.. ’భవాయ్’ చిత్ర నిర్మాతలు ఎలా సెన్సార్ బోర్డ్ నియమ నిబంధనలు ఉల్లంఘించారు. వారిపై సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం తీసుకోబోయే చర్యలను వివరించారు. భవిష్యత్తులో ఎవరు సెన్సార్ బోర్డ్‌తో పరాచకాలు ఆడకుండా వీరిపై కఠిన చర్యలు తీసుకునేలా తమ యాక్షన్ ప్లాన్ ఉంటుందన్నారు. సెన్సార్ బోర్డ్ కూడా కేంద్ర సినిమాటోగ్రఫీ చట్టాలకు అనుగుణంగానే సెన్సార్ సర్టిఫికేట్స్ జారీ చేస్తోంది. అంతేకాదు టైటిల్ మార్పుపై వారు రాజీకి వచ్చినా.. వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ రకంగా టైటిల్ మార్పు చేయడం అంటే సెన్సార్ బోర్డ్‌తో పాటు కేంద్ర రూపొందించిన చట్టాలను ఉల్లంఘించడమే అన్నారు. మొత్తంగా ‘భవాయ్’ చిత్ర టైటిల్ మార్పు ఇపుడు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, CBFC, Censor Board Film Certificate, Prasoon Joshi