Jabardasth - Sampoornesh Babu: జబర్దస్త్‌కు వచ్చిన సంపూర్ణేష్ బాబు.. ఆ ఒక్క డైలాగ్‌తో అందరూ షాక్?

Jabardasth - Sampoornesh Babu

Jabardasth - Sampoornesh Babu: తెలుగు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. హృదయ కాలేయం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు

  • Share this:
    Jabardasth - Sampoornesh Babu: తెలుగు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. హృదయ కాలేయం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో అతిథి పాత్రలలో కూడా నటించాడు. మళ్లీ కొబ్బరిమట్ట అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలలో బిజీగా ఉన్నాడు. ఇక ఈ ఏడాది బజార్ రౌడీ అనే సినిమాలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా క్యాలీఫ్లవర్ అనే టైటిల్ తో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే సంపూర్ణేష్ బాబు ఓ డైలాగ్ చెబుతూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.

    సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు సంపూర్ణేష్ బాబు. ఇక తాజాగా బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో గెస్ట్ గా పాల్గొన్నాడు. వచ్చేవారం ఎపిసోడ్ సంబంధించిన జబర్దస్త్ ప్రోమో విడుదల కాగా అందులో తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. హైపర్ ఆది విష్ణు ప్రియ తో బాగా రచ్చ చేశాడు. రాఘవ, అభి, తాగుబోతు రమేష్ వీరంతా తమ కామెడీ లో తెగ నవ్వించారు. ఇక చంటి 'ఐ' సినిమాలో విక్రమ్ గెటప్ తో తెగ నవ్వించాడు.



    ఇక సంపూర్ణేష్ బాబు కూడా గెస్ట్ గా వచ్చి తన ఎంట్రీ తోనే నవ్వించాడు. అంతేకాకుండా హైపర్ ఆది.. 'నీ క్యాలీఫ్లవర్ చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను' అనడంతో.. వెంటనే సంపూర్ణేష్ బాబు 'భయ్యా నా సినిమా కాలీఫ్లవర్' అని డబుల్ మీనింగ్ వచ్చేలా అనడంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. ఇక అందులో పర్ఫామెన్స్ లకు బాగా ఎంజాయ్ చేశాడు. ఇక చివర్లో కాస్త ఫైర్ అయ్యాడు సంపూర్ణేష్ బాబు. కాలీఫ్లవర్ గురించి ఒక భారీ డైలాగ్ వేస్తూ బాగా ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా చివర్లో జై జబర్దస్త్ అంటూ ఓ డైలాగ్ వేశాడు.
    Published by:Navya Reddy
    First published: