Home /News /movies /

CASTING COUCH ON TV INDUSTRY SHOCKING TRUTHS REVEALED BY KARTHIKA DEEPAM PRIYAMANI NR

Karthika Deepam: బుల్లితెరపై క్యాస్టింగ్ కౌచ్.. అసలు విషయం బయటపెట్టిన కార్తీకదీపం ప్రియమణి?

karthika deepam priyamani

karthika deepam priyamani

Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు ప్రతి ఒక్క నటి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక దాడులు ఎదుర్కొంటారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది నటీమణులు తమ కెరీర్ కోసం అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా వరకు చాలామంది నటీమణులు బయటకు చెప్పుకుంటారు.

ఇంకా చదవండి ...
    Karthika Deepam: సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు ప్రతి ఒక్క నటి క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక దాడులు ఎదుర్కొంటారు. ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది నటీమణులు తమ కెరీర్ కోసం అలాంటివి ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా వరకు చాలామంది నటీమణులు బయటకు చెప్పుకుంటారు. ఇక కొందరు ఆ వలలో చిక్కుకుంటే మరికొంతమంది అటువంటి వాటిని దూరం పెడుతూ చిన్న చిన్న పాత్రలతో తమ జీవితాన్ని నడుపుతారు. ఇదిలా ఉంటే వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా లైంగిక వేదనలు ఉన్నాయని అంతేకాకుండా తనకు ఎదురైన చేదు అనుభవాలని బయట పెట్టింది కార్తీకదీపం ఫేమ్ ప్రియమణి.

    బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ లో మోనిత దగ్గర పనిమనిషిగా చేసే ప్రియమణి. తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్నగా కొన్ని విషయాలు పంచుకుంది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ అనేవి ఉన్నాయని, తాను కూడా అలాంటివి ఎదుర్కొన్నానని తెలిపింది. తనే కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయికి ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయని, ఇక వాటికి అంగీకారం తెలపడం అనేది వారి వ్యక్తిగత విషయాలపై ఆధారపడి ఉంటాయని తెలిపింది. సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా అన్ని రంగాలలో ఇలాంటివి ఉన్నాయని ఒక అమ్మాయి బయట పని చేస్తుంటే కచ్చితంగా అక్కడ ఏదో ఒక సమస్య ఉంటుందని తెలిపింది.

    ఇక లైంగిక విషయంలో వార్నింగ్ లాంటివి ఇచ్చినట్లయితే తమ కెరీర్ అక్కడితో ముగిసినట్లే అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది. ఇక తన విషయంలో కూడా ఇలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఇలాంటి వార్నింగ్ ఇవ్వకుండా సింపుల్ గా నవ్వుతూ బయటకు వచ్చానని తెలిపింది. ఇక తన వ్యక్తిగత విషయంలో కొందరు చిల్లర గాళ్లు ఫోన్ చేయడం వల్ల తనకు ఇంట్లో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపింది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Doctor babu, Karthika Deepam serial, Monitha, Nirupam paritala, Premi vishwanth, Priyamani, Shoba shetty, Vantalakka

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు