హోమ్ /వార్తలు /సినిమా /

యాంకర్ సుమను ఓ ఆట ఆడుకున్న జోగి బ్రదర్స్.. అది నైట్ ప్రాక్టీస్ అంటూ ఓపెన్ కామెంట్స్

యాంకర్ సుమను ఓ ఆట ఆడుకున్న జోగి బ్రదర్స్.. అది నైట్ ప్రాక్టీస్ అంటూ ఓపెన్ కామెంట్స్

Photo Twitter

Photo Twitter

Jogi Brothers: తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో యాంకర్ సుమను ఓ ఆట ఆడుకున్నారు జోగి బ్రదర్స్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రాం ప్రోమో వీడియోలో సుమ పంచులపై జోకులేస్తూ హంగామా చేశారు.

ఇంకా చదవండి ...

బుల్లితెర మాటల మహారాణి సుమ (Suma Kanakala) ఎదుటి వ్యక్తిపై ఎప్పుడు ఎలాంటి పంచ్ విసురుతుందో అస్సలు ఊహించలేం. కానీ ఈ మధ్యకాలంలో అదే సుమపై తెగ కౌంటర్లు వేస్తున్నారు కొందరు. ఆమె హోస్ట్ చేస్తున్న షోస్‌కి వస్తున్న కొంతమంది సెలబ్రిటీలు ఫన్నీగా సుమను ఆట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన క్యాష్ ప్రోమోలో (Cash Latest Promo) అలాంటి సీనే కనిపించింది. తనదైన యాంకరింగ్‌తో కెమెరా ముందు ఎప్పుడూ చలాకీగా కనిపించే ఆమెపై దిమ్మతిరిగే కౌంటర్స్ వేశారు జోగీ బ్రదర్స్ (Jogi Brothers). దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వచ్చే శనివారం ప్రసారం కాబోతున్న క్యాష్ ప్రోగ్రాం ప్రోమో వీడియోలో సుమ పంచులపై జోకులేస్తూ ఓ ఆట ఆడుకున్నారు జోగీ బ్రదర్స్.

టాలీవుడ్‌ నటులు కాదంబరి కిరణ్, రాగిణి, జోగి నాయుడు, కృష్ణంరాజులు సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ప్రోగ్రాంకి గెస్టులుగా వచ్చారు. వీళ్లతో కలిసి తెగ సందడి చేసింది యాంకర్ సుమ. తనదైన శైలి టైమింగ్‌తో అందరినీ ముప్పతిప్పలు పెట్టేసింది ఈ సీనియర్ యాంకర్. ఈ క్రమంలో సుమ వేసే పంచులు వెనుక సీక్రెట్స్ బయటపెడుతూ జోగీ బ్రదర్స్ ఓపెన్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విని సుమ ఒక్కసారిగా అవాక్కయింది.

సెలెబ్రిటీలతో సందడి చేస్తూ చాలాకాలంగా క్యాష్ షోను నడిపిస్తూ వస్తోంది సుమ కనకాల. మాట మాటకు పంచ్ విసురుతూ పొట్ట చెక్కలయ్యే వినోదం పంచుతూనే సెలబ్రిటీల తాలూకు ఎన్నో సీక్రెట్స్ బయటకు తెలిసేలా చేస్తోంది. అయితే తాజా ప్రోమోలో మాత్రం రివర్స్ సీన్ కనిపించింది. సుమ వేసే పంచులపై పైనే తిరిగి పంచ్ వేసి ఆమెకు దిమ్మతిరిగే షాకిచ్చారు జోగీ బ్రదర్స్. అందరినీ ఆట పట్టించే ఆమెనే టార్గెట్ చేసి కౌంటర్లు వేశారు.

యాంకర్ సుమ, ఆమె పంచులు గురించి వివరణ ఇస్తూ ఓ స్పెషల్ స్కిట్ వేసిన జోడీ బ్రదర్స్.. ఇందులో సుమ ఏజ్, సంపాదన, పంచ్ టైమింగ్స్ తదితర విషయాలపై ఫోకస్ పెట్టారు. ఒకరకంగా చెప్పాలంటే సుమపై వాళ్ళిద్దరి డామినేషన్ కనిపించింది. సుమ వేసే పంచులు అనుకోని వేస్తుందంటావా? లేదా అప్పటికప్పుడు వేసేస్తుందా' అని జోగి నాయుడు అడగడంతో 'పడుకోదు.. రాత్రంతా పంచులన్నీ ప్రాక్టీస్ చేసి చేసి పొద్దున్నే వేసేస్తది' అని బాంబ్ పేల్చాడు కృష్ణంరాజు. అంతేకాదు వాటిని మనం మాత్రం నేర్చుకోలేం. ఎందుకంటే మలయాళం మనకు అర్థం కాదని అనేశాడు. ఇది విని సుమ సహా అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వేశారు. ఏదేమైనా ప్రోమో వీడియోలతో ఎప్పటికప్పుడు ఎపిసోడ్స్‌పై ఆసక్తి రేకెత్తించడంలో సక్సెస్ అవుతోంది మల్లెమాల టీమ్.

First published:

Tags: Anchor suma, Cash promo, Suma Kanakala

ఉత్తమ కథలు