కమల్ హాసన్, శంకర్‌లకు కోర్ట్ సమన్లు.. నిర్మాతపై పోలీస్ కేసు..

Indian 2: నిర్మాణ సంస్థ లైకాపై కేసు ఫైల్ చేసారు పోలీసులు. ఈ ఘటనపై చెన్నైలోని పూనమలి పోలీసులు లైకా ప్రొడక్షన్స్ అధినేత, చిత్ర నిర్మాత ఎ.సుబస్కరన్‌కు నోటీసులు కూడా ఇచ్చారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 21, 2020, 2:55 PM IST
కమల్ హాసన్, శంకర్‌లకు కోర్ట్ సమన్లు.. నిర్మాతపై పోలీస్ కేసు..
కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)
  • Share this:
ఇండియన్ 2 సినిమా సెట్‌లో జరిగిన ప్రమాదం ఎంత సంచలనం సృష్టించిందనేది ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భారీ బడ్జెట‌్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అందులో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు కూడా ఉన్నాడు. ఆయనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ.. ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్ ఉన్నారు. వీళ్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఒక్కొక్కరికి కోటి రూపాయల సాయం కూడా ప్రకటించాడు కమల్ హాసన్. ఇక లైకా ప్రొడక్షన్ కూడా సాయం చేస్తుంది. శంకర్ కూడా తోడుంటానని హామీ ఇచ్చాడు. ఇలాంటి సమయంలో దర్శకుడు శంకర్, హీరో కమల్‌‌కు కోర్టు సమన్లు వచ్చాయి.

కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)
కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)


ఇక నిర్మాణ సంస్థ లైకాపై కేసు ఫైల్ చేసారు పోలీసులు. ఇదే విషయంపై తమిళనాడు పోలీసులు మీడియాకు సమాచారం అందించారు. ఈ ఘటనపై చెన్నైలోని పూనమలి పోలీసులు లైకా ప్రొడక్షన్స్ అధినేత, చిత్ర నిర్మాత ఎ.సుబస్కరన్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. ఆయనపై కేసులు ఫైల్ చేసారు. ఇక సినిమా నిర్మాతతో పాటు క్రేన్ యజమాని, క్రేన్ ఆపరేటర్‌పై కూడా కేసులు పెట్టారు.

కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)
కమల్ హాసన్ (Kamal Haasan Shankar Indian 2)


IPC సెక్షన్ 287 (యంత్రాల విషయంలో నిర్లక్ష్యం వహించడం), సెక్షన్ 337 (ఇతరుల జీవితానికి, వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం), సెక్షన్ 338 (ఇతరుల జీవితానికి, వ్యక్తిగత భద్రతకు తీవ్ర హాని తలపెట్టడం), సెక్షన్ 304ఎ (నిర్లక్ష్యం కారణంగా మరణం) కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై తమిళనాట చర్చలు భారీగానే జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా భారతీయుడు 2 ఇలా ట్రెండ్ అవ్వడం మాత్రం అభిమానులు అస్సలు తట్టుకోలేకపోతున్నారు.
Published by: Praveen Kumar Vadla
First published: February 21, 2020, 1:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading