కోర్డు కెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’...అనుపమ్ ఖేర్‌పై కేసు

మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది.తాజాగా ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్‌తో పాటు చిత్ర దర్శక, నిర్మాతలపై బిహార్ న్యాయస్థానంలో కేసు నమోదైంది.

news18-telugu
Updated: January 3, 2019, 3:17 PM IST
కోర్డు కెక్కిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’...అనుపమ్ ఖేర్‌పై కేసు
‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్
  • Share this:
మాజీ ప్రధాన మంత్రి, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ...ప్రధాని కావాడానికి దారి తీసిన పరిస్థితులపై బాలీవుడ్‌లో ‘ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించాడు.

తాజాగా ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్రలో నటించిన అనుపమ్ ఖేర్‌తో పాటు చిత్ర దర్శక, నిర్మాతలపై బిహార్ న్యాయస్థానంలో కేసు నమోదైంది. సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది ఈ చిత్రానికి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు ఈ సినిమాలో రాజకీయంగా పేరున్న నేతలను కించపరిచేలా ఈ సినిమాలో సన్నివేశాలున్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. న్యాయస్థానం ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఈ నెల 8న విచారణ్ జరపనుంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ పాత్రికేయుడు అప్పటి ప్రధాని మీడియా సలహాదారు సంజయ్ బారు రాసిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ అనే పుస్తకం ఆధారంగా విజయ్ రత్నాకర్ డైరెక్ట్ చేసాడు. రీసెంట్‌గా విడుదలైన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు..దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ సినిమాపై పెద్ద రచ్చ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమా విడుదలకు ముందే తమకు చూపించాలని ఆ పార్టీ వాళ్లు పట్టుపడుతున్నారు. ఇప్పటికే ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ ట్రైలర్ యూట్యూబ్‌లో కనిపించడంలో లేదంటూ ఈసినిమా ముఖ్యపాత్రధారి అనుపమ్ ఖేర్ తన అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తానికి ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ సినిమా ముందు ముందు ఎలాంటి రచ్చకు దారి తీస్తుందో చూడాలి.

కృతి కర్బందా.. ఇన్‌స్టాగ్రామ్ ఫోటోస్..




ఇవి కూడా చదవండి 

మ‌హేశ్ బాబు.. రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు అల్లు అర్జున్..పెళ్లిపై అనుష్క మ‌న‌సులో మాట.. ప‌ప్ప‌న్నం ఎప్పుడంటే..?

సినిమా చూపిస్తా మావ…కథలో కథానాయకులు

 
First published: January 3, 2019, 3:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading