Home /News /movies /

CASE AGAINST RAJAMOULI HEROINR ALIA BHATT BY GANGUBAI KATHIAWADI SON MHN

Alia Bhatt: రాజమౌళి హీరోయిన్ కి షాక్.. కోర్టులో కేసు నమోదు

Case against Rajamouli Heroinr Alia Bhatt By Gangubai Kathiawadi son

Case against Rajamouli Heroinr Alia Bhatt By Gangubai Kathiawadi son

Alia Bhatt: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌లో ఒకరైన ఆలియా భట్‌పై కోర్టులో కేసు నమోదైంది. ఆమె లేటెస్ట్‌ 'గంగూబాయి కతియావాడి' చిత్రాన్ని ఆపాలంటూ గంగూబాయి కుమారుడు కోర్టులో కేసు వేశాడు.

    ఒకవైపు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌.. మరోవైపు ప్యాన్‌ ఇండియా మూవీతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా దగ్గర కావాలని ఆమె ప్రయత్నాలు చేస్తుంది. అయితే అనుకోని షాక్‌ ఆమెకు కంగారు పుట్టిస్తుంది. ఇంతకీ ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో కాదు.. ఆలియాభట్‌. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్యాన్‌ ఇండియా మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్(రౌద్రం రణం రుధిరం)‌' నటిస్తున్న ఆలియా బాలీవుడ్‌లో 'గంగూబాయ్‌ కతియావాడి'లో టైటిల్ రోల్‌ను క్యారీ చేస్తుంది. ముంబైలోని కామతిపుర ప్రాంతానికి చెందిన వేశ్యగృహాలకు అధిపతి అయిన గంగూబాయ్‌ అనే మహిళ జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతగా గంగూబాయ్‌ జీవితంలో ఏముందని అనుకోకండి. ఎందుకంటే.. లేడీ డాన్‌గా ముంబై మాఫియా సామ్రాజ్యంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది ఆమె. దీంతో ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో ఆలియా మెయిన్‌ లీడ్‌ రోల్‌ను క్యారీ చేస్తుంది. సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అంతా బాగానే ఉంది అని యూనిట్‌ అనుకుంటున్న సమయంలో అనుకోని అడ్డంకిగా గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా.

    తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగడంతో పాటు తన తల్లి గురించి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బాబూజీ చిత్ర దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలి, టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఆలియా భట్‌, నిర్మాణ సంస్థపై కేసు వేశాడు. వీరితో పాటు ముంబై మాఫియాలో లేడీ డాన్‌గా పేరు తెచ్చుకున్న గంగూబాయ్‌ జీవిత చరిత్రపై రీసెర్చ్‌ చేసి మాఫియా క్వీన్స్ ఆఫ్‌ ముంబై అనే నవలను హస్సేన్‌ జైదీ అనే రైటర్‌ను కూడా ఈ కేసులో యాడ్‌ చేశాడు బాబూజీ. తన తల్లిపై వస్తున్న పుస్తక ప్రచురణను ఆపడంతో పాటు సినిమాను కూడా ఆపాలంటూ బాబూజీ రాజీ షా డిమాండ్‌ చేస్తున్నారు.

    సంజయ్‌ లీలా భన్సాలి సినిమాకు వివాదాలేమీ కొత్త కావు. అదే బాటలో మరోసారి గంగూబాయి కతియావాడి సినిమా కూడా అడ్డంకులు ఎదుర్కొంటుంది. మరి ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై చిత్ర యూనిట్‌ ఏమీ స్పందించలేదు. మరి కోర్టు ఈ విషయం ఎలా రెస్పాండ్‌ అవుతుందో చూడాలి.
    Published by:Anil
    First published:

    Tags: Alia Bhatt, Bollywood, Sanjay Leela Bhansali

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు