Home /News /movies /

CAR ACCIDENT AT BALAKRISHNA HOUSE IN JUBILEE HILLS HYDERABAD SB

Balakrishna: బాలకృష్ణ ఇంటి ముందు కలకలం.. కారుతో దూసుకెళ్లిన యువతి

బాలయ్య లెజెండ్ సినిమాకు 8 ఏళ్లు పూర్తి (legend movie)

బాలయ్య లెజెండ్ సినిమాకు 8 ఏళ్లు పూర్తి (legend movie)

జూబ్లీహిల్స్‌లో ఉన్న బాలయ్య ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు ఆయన ఇంటిమీదకు దూసుకెళ్లింది. బాలయ్య ఇంటి గేటును బలంగా ఢీకొట్టింది.

    టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ(Balakrishna) ఇంటి వద్ద ఓ కారు ప్రమాదానికి గురైంది. సరిగ్గా ఆయన ఇంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌(Hyderabad) జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 వద్ద బాలకృష్ణ నివాసం ఉంటున్నారు.  అయితే ఆయన ఇంటివైపునకు ఓ కారు దూసుకెళ్లింది. అక్కడితో ఆగకుండా వేగంగా వెళ్లిన కారు.. బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తర్వాత బాలకృష్ణ ఇంటివైపునకు వెళ్లిన కారు ఇంటి గేట్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.

    దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు. కాసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయ్యింది. దీంతో బాలయ్య ఇంటి వద్దకు భారీగా జనం తరలివచ్చారు. అయితే ఓ యువతి ఈ కారు ప్రమాదం చేసినట్లు గుర్తించారు. అంబులెన్స్ రావడంతో.. అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో యువతి తన కారును.. డివైడర్‌పైకి ఎక్కించింది. దీంతో అక్కడ నుంచి అదుపు తప్పి.. బాలయ్య ఇంటివైపు దూసుకెళ్లింది.

    బాలకృష్ణ (Balakrishna) ఇంటిగేటు వైపునకు కారు దూసుకెళ్లి.. గేట్‌ను బలంగా ఢీకొట్టి నిలిచిపోయింది. అయితే బాలయ్య ఇంటి ముందు రోడ్డు ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా జనాలు భారీగా గుమిగూడారు. దీంతో అక్కడ కొద్దిసేపు భారీగా ట్రాఫిక్‌ జామ్‌(Traffic Jam) అయింది. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వెంటనే  ట్రాఫిక్ క్లియర్‌ చేసి వాహనాలను పంపించి వేశారు. బాలయ్య ఇంటి ముందు ఉన్న కారును కూడా తొలగించారు. ఈ ఘటన మంగళవారం (మే 17) సాయంత్రం చోటుచేసుకుంది.

    జూబ్లీహిల్స్ చెక్‌పోస్టుకు కొంచెం దూరంలోనే.. బాలకృష్ణ ఇల్లు ఉంటుంది. అయితే ఈ రోడ్డుపై రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది. నిత్యం వాహనాల రాకపోకలతో రోడ్డుపై ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. బాలయ్య ఇంటికి కాస్త పక్కగానే ట్రాఫిక్ సిగ్నల్ కూడా ఉంటుంది.అయితే ఇంత రద్దీ ప్రాంతంలో ఇలా యాక్సిడెంట్ కావడంతో... అక్కడున్న వారు షాక్ అవుతున్నారు.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Balakrishna, Nandamuri balakrishna

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు