హోమ్ /వార్తలు /సినిమా /

Vijaykanth: విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమం.. కాలు వేలు తీసేసిన డాక్టర్లు...రజనీకాంత్ ట్వీట్

Vijaykanth: విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమం.. కాలు వేలు తీసేసిన డాక్టర్లు...రజనీకాంత్ ట్వీట్

కెఫ్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమం

కెఫ్టెన్ విజయ్‌కాంత్ ఆరోగ్యం విషమం

విజయ్‌కాంత్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తాజాాగా ఆయన మరోసారి ఆస్పత్రిలో చేరడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

ప్రముఖ తమిళ సినీనటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. హీరో విజయకాంత్ ఆరోగ్యం విషమంగా ఉందని కోలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్‌కాంత్‌ కుడి కాలి వేలిని వైద్యులు తొలగించారు. విజయ్‌కాంత్‌ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన నగరంలోని ప్రైవేటు ఆసుపత్రిలో సాధారణ వైద్యపరీక్షల కోసం చేరగా... మధుమేహం అధికం కావటంతో కుడి కాలి వేలికి రక్త ప్రసరణ జరగడంలేదని వైద్యులు గుర్తించారు. దానివల్ల ఆ వేలు కుళ్లిపోయే అవకాశం ఉండటంతో సోమవారం దానిని తొలగించారు.

మరోవైపు విజయ్‌కాంత్‌ ఆరోగ్యంపట్ల అభిమానులు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. విజయ్‌కాంత్‌ క్షేమంగా వున్నారని, ప్రసార మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దని ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. విజయ్ కాంత్‌కు సర్జరీల మీద సర్జరీలు చేస్తూ ఉన్నారు వైద్యులు.. అయినా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఆయనను బయట చూసి ఎన్నో ఏళ్ళు అయిపోతుంది. గతంలో ఒక సర్జరీ చేయించుకొని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్ కు మరో సర్జరీ జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సర్జరీతో ఆయన కుడి పాదం నాలుగు వేళ్లు తొలగించినట్లు వార్తలు గుప్పమన్నాయి.

ఇక ఈ వార్తపై విజయకాంత్ పార్టీ సభ్యులు స్పందిస్తూ.. నాలుగు వేళ్లు తొలగించడమా అబద్దమని, రక్త ప్రసారం జరగడానికి ఒక వేలును మాత్రమే తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పార్టీ సభ్యులు తెలిపారు. విజయ్‌కాంత్ త్వరగా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. కెప్టెన్ విజయకాంత్ గా తమిళ్ లోనే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. ఆయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. విజయకాంత్ ఆరోగ్యం గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ ట్వీట్ చేశాడు . “నా అద్భుతమైన స్నేహితుడు త్వరగా కోలుకోని మళ్లీ మునుపటి కెప్టెన్ లా గర్జించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

First published:

Tags: Kollywood News, Rajnikanth, Vijayakanth

ఉత్తమ కథలు