Home /News /movies /

CAN YOU RECOGNIZE THIS TOLLYWOOD HERO WHO IS TAKING MEDAL PK

ఇక్కడ మెడల్ అందుకుంటున్న ఈ హీరోను గుర్తు పట్టగలరా..?

టాలీవుడ్ హీరో (Tollywood Hero)

టాలీవుడ్ హీరో (Tollywood Hero)

కొందరు హీరోలు చూస్తుండగానే మారిపోతుంటారు. వాళ్ల పాత ఫోటోలు చూస్తే అస్సలు గుర్తు పట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూస్తున్న హీరో కూడా అంతే.

కొందరు హీరోలు చూస్తుండగానే మారిపోతుంటారు. వాళ్ల పాత ఫోటోలు చూస్తే అస్సలు గుర్తు పట్టడం సాధ్యం కాదు. ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూస్తున్న హీరో కూడా అంతే. ఈయన కూడా తెలుగు ఇండస్ట్రీకి ఎలాంటి సందడి లేకుండా చాలా సైలెంట్‌గా వచ్చాడు. అతడే కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఈయన ఎంట్రీ ఇచ్చినపుడు చాలా మందికి తెలియదు సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చాడని. ఆ తర్వాత మెల్లగా తెలిసింది. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అక్కడ పెద్దగా ఆధారపడకుండా చిన్న సినిమాలతో.. తనకు సూట్ అయ్యే పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నాడు సుధీర్.
సుధీర్ బాబు ఫైల్ ఫోటో (Sudheer Babu)
సుధీర్ బాబు ఫైల్ ఫోటో (Sudheer Babu)

అప్పుడప్పుడూ తన సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబును కూడా బాగానే వాడేస్తుంటాడు ఈయన. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. బ్యాడ్మింటన్‌లో నేషనల్ ప్లేయర్ కూడా. ఆ తర్వాత క్రికెట్‌లో కూడా ప్రవేశం ఉంది. ఇక ఫిట్‌నెస్ విషయంలో ఇప్పటి హీరోలు చాలా మంది సుధీర్‌ను చూసి కుళ్లుకుంటారు. ఒకప్పుడు బ్యాడ్మింటన్ ఆడుతున్నపుడు ఆంధ్రప్రదేశ్‌లో నంబర్ వన్ ర్యాంకు కూడా సాధించాడు. బ్యాడ్మింటన్ స్టార్, కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిస డబుల్స్ పార్ట్‌నర్‌గా కూడా ఉన్నాడు సుధీర్ బాబు.

ఆ తర్వాత ఆయన అక్కడికి వెళ్లడం.. ఈయన సినిమాల్లోకి రావడం జరిగాయి. అప్పట్లో తాను మెడల్ అందుకున్నప్పటి అరుదైన ఫోటోను సుధీర్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఇంద్రగంటి తెరకెక్కించిన వి సినిమాలో హీరోగా నటించాడు సుధీర్ బాబు. ఇందులో నాని విలన్ కావడం విశేషం. పైగా ఇది ఆయనకు 25వ సినిమా. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. నివేతా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లుగా నటించారు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Sudheer Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు