ఈయన్ని ఎక్కడో చూసినట్లుందే.. అర్రే బాగా తెలిసిన మొహంలా కూడా అనిపిస్తుంది.. చాలా సినిమాల్లో చూసాం కానీ గుర్తు రావడం లేదే అనుకుంటున్నారా..? ఒక్కసారి మళ్లీ చూడండి వెంటనే గుర్తొస్తాడు. ఎందుకంటే అంత ఈజీగా మరిచిపోయే ఫేస్ కాదు ఇది.. అంత త్వరగా తగ్గిపోయే ఫేమ్ కూడా కాదాయే మనోడిది. ఈయన నోరు విప్పాడంటే రచ్చ రచ్చే.. భజన సంఘాలు కూడా అన్నీ మూసుకుని ఈయన్ని ఫాలో అయిపోవాల్సిందే. అంత మాటల మరాఠీ.. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఈయనెవరో..? ఆ.. మీరు అనుకున్నదే కరెక్ట్.. ఆయనే వన్ అండ్ ఓన్లీ బండ్ల గణేష్.
ఇప్పుడు కాదు కొన్ని దశాబ్ధాల క్రితమే ఈయన ఇండస్ట్రీకి వచ్చాడు. అప్పట్నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయాడు. వచ్చిన కొత్తలో సాఫ్ట్ పోర్న్ సినిమాలు కూడా చేసాడు ఈయన. అప్పట్లో తెలుగు నటి జయలలితతో కలిసి శృంగార సన్నివేశాల్లో కూడా నటించాడు బండ్ల గణేష్. ఆ తర్వాత మెల్లగా కమెడియన్ అయి.. నిర్మాతగా మారి బ్లాక్బస్టర్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్నాడు.
కరోనా పాజిటివ్ రావడంతో రెండు మూడు రోజులుగా వార్తల్లో నిలిచాడు ఈ నిర్మాత. త్వరలోనే పవన్ కళ్యాణ్ డేట్స్ తీసుకుని సినిమా నిర్మిస్తానంటున్నాడు ఈయన. మీసాలు కూడా రాని వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి.. ఇప్పటికీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఇక్కడే ఉండిపోయాడు బండ్ల. ఏదేమైనా ఎవరేమన్నా కూడా బండ్ల గణేష్ అంటే మాత్రం ఫుల్ ఎంటర్టైనర్ అంతే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandla Ganesh, Telugu Cinema, Tollywood