HOME »NEWS »MOVIE »can you guess this tollywood sensational director who broken all records pk

Guess Who: రికార్డులు తిరగరాసిన ఈ స్టార్ డైరెక్టర్‌ను గుర్తు పట్టండి చూద్దాం..

Guess Who: రికార్డులు తిరగరాసిన ఈ స్టార్ డైరెక్టర్‌ను గుర్తు పట్టండి చూద్దాం..
టాలీవుడ్ దర్శకుడు

అరె.. ఈ కుర్రాడెవరో భలే ఉన్నాడే.. ఎక్కడో చూసినట్లు కూడా ఉంది అనుకుంటున్నారా..? కాస్త ఫోకస్ చేస్తే ఈయనెవరో కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఈ కుర్రాడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్నాడు.

  • Share this:
అరె.. ఈ కుర్రాడెవరో భలే ఉన్నాడే.. ఎక్కడో చూసినట్లు కూడా ఉంది అనుకుంటున్నారా..? కాస్త ఫోకస్ చేస్తే ఈయనెవరో కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఈ కుర్రాడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. ఈ నూనూగు మీసాల పిల్లోడే మూడేళ్ల కింద ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసాడు. గుర్తు పట్టారా.. ఎస్ మీరు ఊహించిన పేరు నిజమే.. అతడెవరో కాదు లెక్కల మాస్టారు సుకుమార్. అప్పుడెప్పుడో ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తాజాగా పుష్ప వరకు సంచలన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు సుకుమార్. సినిమాల్లోకి రాకముందు ఈయన లెక్కల మాస్టారుగా పని చేసారు. అక్కడ్నుంచి సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చాడు. ఆర్య సినిమాతో ట్రయాంగిల్ లవ్‌లో కొత్త కోణం చూపించాడు. ఆ వెంటనే జగడం అంటూ మరో సంచలనం సృష్టించాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా మేకింగ్‌లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఇప్పటికీ సంచలనమే. ఆర్య 2 అంచనాలు అందుకోలేకపోయినా కూడా 100 పర్సెంట్ లవ్ సినిమాతో మెప్పించాడు. ఆ వెంటనే మహేష్ బాబుతో నేనొక్కడినే అంటూ భిన్నమైన కథ ట్రై చేసాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో అంటూ ఎమోషనల్ టచ్ ఉన్న కథతో మనసులను తాకాడు.
sukumar,sukumar twitter,sukumar movies,sukumar old photo,sukumar rare photos,sukumar pushpa movie,sukumar pushpa movie shooting,sukumar allu arjun pushpa,telugu cinema,సుకుమార్,సుకుమార్ ఓల్డ్ ఫొటో,సుకుమార్ రేర్ ఫోటోస్
దర్శకుడు సుకుమార్ (Director Sukumar)

నాన్నకు ప్రేమతో వరకు కూడా సుకుమార్ అంటే అర్థం కాని హాలీవుడ్ సినిమాలు చేస్తాడనే విమర్శలుండేవి. అలాంటి సమయంలో తాను కూడా మాస్ రూట్‌లోకి వచ్చి రంగస్థలం చేసాడు. అప్పుడెప్పుడో ఓసారి రాజమౌళి చెప్పాడు.. సుకుమార్ కానీ మాస్ సినిమా చేస్తే మేమంతా తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే అని. అన్నట్లుగానే రంగస్థలంతో రికార్డులు తిరగరాసాడు. ఇప్పుడు పుష్పతో మరోసారి మాస్ సినిమానే చేస్తున్నాడు ఈయన. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సుకుమార్ అప్పట్లో తన స్నేహితుడితో సరదాగా దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Published by:Praveen Kumar Vadla
First published:January 17, 2021, 21:18 IST

टॉप स्टोरीज