CAN YOU GUESS THIS HOT BEAUTY BEHIND COLORS AND HERE THE DETAILS OF THIS ACTRESS PK
Guess Who: రంగుల మాటున దాగిన ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..?
టాలీవుడ్ హీరోయిన్
Guess Who: హోలీ (Holi 2021) అంటేనే రంగుల్లో తేలే సంబరాలు. దాన్ని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా.. రాజు పేద అనే తారతమ్యం లేకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. కరోనా సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు.
రంగుల్లో దాగిపోయిన ఈ ముద్దుగుమ్మను ఎక్కడో చూసినట్లుంది కదా..? ఈ మధ్యే రామ్ హీరోగా నటించిన సినిమాలో కూడా కనిపించింది ఈ బ్యూటీ. దానికి ముందు రవితేజతో జోడీ కట్టింది. ఇంకా గుర్తు పట్టలేదా..? మరోసారి చూడండి.. ఐడియా వచ్చేస్తుంది. మీరు ఊహించిందే కరెక్ట్.. ఈ భామ ఎవరో కాదు మాళవిక శర్మ. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా తొలి సినిమాతోనే కొందరు ముద్దుగుమ్మలు అలా గుర్తుండిపోతారు. ఇప్పుడు అలాగే గుర్తుంది మాళవిక శర్మ. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. కానీ ఒక్కసారి రవితేజ నటించిన నేలటిక్కెట్టు సినిమా గుర్తు చేస్తే మాత్రం ఆమె కూడా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో అంతగా అందాలు ఆరబోసింది ఈ బ్యూటీ. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో రెండేళ్లకు పైగా ఖాళీగానే ఉండిపోయింది మాళవిక. అలాంటి సమయంలో రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో చేసింది చిన్న పాత్రే అయినా కూడా అందాలు ఫుల్లుగా ఆరబోసింది. అంతేకాదు రామ్ పోతినేనితో లిప్ లాక్ సీన్ కూడా చేసింది. రెడ్ హాట్ అందాలను చూసిన తర్వాత ఇప్పుడు ఈ భామకు ఆఫర్లు బాగానే వస్తున్నాయి.
దాంతో మరింత అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది. తాజాగా హోలీ సంబరాల్లో మునిగిపోయింది మాళవిక. పూర్తిగా రంగుల్లో మునిగిపోయి మొహం కూడా గుర్తు పట్టకుండా అయిపోయింది. ఇప్పుడు విడుదలైన ఓ ఫోటోషూట్ చూసి అభిమానులు సైతం ఫిదా అయిపోతున్నారు. ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయి కేవలం షర్ట్‌తోనే రంగుల్లో తేలిపోయింది మాళవిక. ఈ ఫోటోలను చూసి గూగుల్ తల్లి సైతం వేడెక్కిపోతుంది.
మాళవిక శర్మ హాట్ పోటోషూట్ (malvika sharma/Source: Instagram)
థర్మా మీటర్లు పేల్చేసే అందాలతో దున్నేస్తున్న ఈ భామను చూసి నిర్మాతలు కూడా అవకాశాలు ఇస్తున్నారు. నేల టిక్కెట్టు సినిమాలో నాజూగ్గా కనిపించిన మాళవిక.. ఇప్పుడు మాత్రం ఊహించని విధంగా లావు అయిపోయింది. అభిమానులు కూడా ఈ బ్యూటీని చూసి షాక్ అవుతున్నారు. బ్రాండ్స్‌లో దూసుకుపోయిన మాళవిక.. ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఆఫర్లు వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటానంటుంది మాళవిక.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.