అక్షయ్ కుమార్ 30 రోజుల ఖర్చు ఎంతో తెలుసా..?

Akshay Kumar: ఊహకందని పనులు చేయడంలో అందరికంటే ముందుంటాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. మొన్నటికి మొన్న విరాళం కింద ఏకంగా 30 కోట్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 5:56 PM IST
అక్షయ్ కుమార్ 30 రోజుల ఖర్చు ఎంతో తెలుసా..?
అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)
  • Share this:
ఊహకందని పనులు చేయడంలో అందరికంటే ముందుంటాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. మొన్నటికి మొన్న విరాళం కింద ఏకంగా 30 కోట్లు ప్రకటించి ఔరా అనిపించాడు ఈయన. ఇప్పటి వరకు ఇండియాలో ఈయనే హైయ్యస్ట్ విరాళం అందించిన హీరో. బాలీవుడ్‌లో కోట్లకు కోట్లు పారితోషికం తీసుకునే హీరోలు కూడా అక్షయ్ మాదిరి అంతగా విరాళం అందించలేదు. ఇదిలా ఉంటే ఈయన సినిమాల్లోనే కాదు బయట కూడా హీరోనే. అయితే ఆయన ఖర్చులు మాత్రం అలా ఉండవు. అక్షయ్ కుమార్ రేంజ్ ఉన్న హీరో నెలంతా కలిపితే ఎంత ఖర్చు చేయాలి.. కనీసం కోటి రూపాయలు.. ఇంకా ఎక్కువ ఖర్చు చేస్తే కోటిన్నర.. మెయింటెనెన్సులు అన్నీ కలిపి మరో 50 లక్షలు.. ఇలా చెప్తూ పోతే కోట్లే ఖర్చు అవుతాయి కదా అనుకుంటున్నారా..?

అక్షయ్ కుమార్ మరో భారీ విరాళం (Akshay Kuma/ Twitter)
అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)


అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూ చాలా విషయాలు చెప్పాడు. షూటింగ్ ఉన్నా లేకున్నా అక్షయ్ కుమార్ దినచర్య ఉదయం 4 గంటలకే మొదలవుతుంది. బాలీవుడ్‌లో చాలా మంది హీరోలు, హీరోయిన్లు అప్పుడే పార్టీలు అవ్వగొట్టేసి ఇంటికి వచ్చి పడుకునే టైమ్ అది.. అలాంటి టైమ్‌లో అక్షయ్ నిద్ర లేస్తాడు.. పైగా ఈయనకు పార్టీలు, పబ్బులు అలవాటు లేదు. ధూమపానం, మద్యపానానికి పూర్తిగా దూరం. అంతేకాదు ప్రపంచం బద్ధలైపోయినా ఆరు దాటితే షూటింగ్ చేయడు.. రాత్రి 9.30 నుంచి 10 గంటల మధ్యలో కచ్చితంగా పడుకుంటాడు. మళ్లీ వెంటనే 4 గంటలకు లేచి వర్కవుట్స్ చేస్తానని చెబుతున్నాడు ఈయన.

అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)
అక్షయ్ కుమార్ (Akshay Kuma/ Twitter)


షూటింగ్స్‌కు ఆలస్యంగా వెళ్తే తన నిర్మాతలకు నష్టం కలుగుతుందనే భావన ఎప్పుడూ తన బుర్రలో ఉంటుందని చెప్తున్నాడు ఖిలాడీ. అందుకే షూటింగ్‌కు ఆన్ టైమ్ వెళ్లడం అలవాటు చేసుకున్నానని చెప్పాడు ఈయన. ఇక ఎన్ని పనులున్నా కూడా తన కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కచ్చితంగా ఇస్తానని.. అందులో కాంప్రమైజ్ అయ్యేది లేదంటున్నాడు అక్షయ్ కుమార్. డబ్బులొస్తున్నాయి కదా అని ఎక్స్ ట్రా పని చేయడం తన వల్ల కాదంటున్నాడు అక్షయ్. ఇక భార్యతో పడుకునే ముందు ప్రతీరోజూ భార్యతో పేకాట (రమ్మీ) ఆడటం అలవాటు. ఈ పేకాటలో ట్వింకిల్‌కు ఇప్పటి వరకు 4.5 లక్షల రూపాయలు బాకీ పడ్డానని చెప్పాడు ఈయన.

భార్య ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్ (Akshay Kumar Twinkle Khanna)
భార్య ట్వింకిల్ ఖన్నాతో అక్షయ్ కుమార్ (Akshay Kumar Twinkle Khanna)


ఆ మధ్య కపిల్ శర్మ కామెడీ నైట్స్‌కు హాజరైన అక్షయ్ కుమార్ తన నెలసరి ఖర్చు 10 వేల రూపాయలలోపే ఉంటుందని చెప్పి సంచలనం సృష్టించాడు. ఇంకా ఖర్చులు పెరిగితే మరో 3 వేలకు మించి కావని చెప్పాడు ఈయన. తాను మద్యం సేవించనని.. సిగరెట్లు తాగనని.. షూటింగులకు వెళ్తే నిర్మాతే తన ఖర్చంతా భరిస్తారని చెప్పాడు. ఇక నాకు ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి అంటూ అక్షయ్ కుమార్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అందుకే ఎప్పుడు ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా సాయం చేయడానికి ముందుకొస్తాడు అక్షయ్ కుమార్.
First published: May 28, 2020, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading