చిరంజీవితో ఈ ఫోటోలో ఉన్న కమెడియన్‌ను గుర్తు పట్టారా..

Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో ఆయన స్టార్ కమెడియన్. 20 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే వందల సినిమాల్లో నటించాడు. హీరోగా కూడా సత్తా చూపించాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 2, 2020, 10:55 PM IST
చిరంజీవితో ఈ ఫోటోలో ఉన్న కమెడియన్‌ను గుర్తు పట్టారా..
చిరంజీవితో ఫోటో దిగిన టాలీవుడ్ నటుడు (Chiranjeevi)
  • Share this:
తెలుగు ఇండస్ట్రీలో ఆయన స్టార్ కమెడియన్. 20 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే వందల సినిమాల్లో నటించాడు. హీరోగా కూడా సత్తా చూపించాడు. ఇప్పుడు మళ్లీ కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా విలన్ అవతారం ఎత్తాడు. ఇక చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి అంటే ఈయనకు ప్రాణం. అప్పట్లోనే చిరంజీవి పాటలకు డాన్సులు వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పేరుకు కమెడియన్ అయినా కూడా హీరోకు ఉన్నంత క్రేజ్ ఈయన సొంతం. ఇంత ఉపోద్ఘాతం విన్న తర్వాత అతనెవరో చెప్పనక్కర్లేదుగా. మీరు ఊహించిన పేరు కరెక్టే.. అతడే మన సునీల్. ఈ ఫోటోలో చిరంజీవితో కనిపిస్తుంది కూడా ఈయనే.

నటుడు సునీల్ (actor Sunil )
నటుడు సునీల్ (actor Sunil )


ఒకప్పుడు అలా ఉండేవాడు ఈ భీమవరం బుల్లోడు. ఎన్నో సినిమాల్లో కామెడీ చేసిన ఈయన ఈ మధ్యే విలన్‌గా టర్న్ అయ్యాడు. డిస్కో రాజా సినిమాలో ప్రతినాయకుడిగా నటించిన సునీల్.. ఇప్పుడు కలర్ ఫోటో సినిమాలో కూడా అలాంటి పాత్రలోనే నటిస్తున్నాడు. ఆ మధ్య ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ వేడుకలో సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాడు చిరు. తనకు సునీల్ ఆదర్శం అని చెప్పాడు. గుండులా ఉండే సునీల్.. సిక్స్ ప్యాక్ చేసి ఆదర్శంగా నిలిచాడని చెప్పాడు చిరంజీవి. మొత్తానికి చిరుతో సునీల్ అనుబంధం విడదీయరానిది.
First published: April 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading