తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పై చేయి సాధించిన బాలయ్య నిర్మాత సి.కళ్యాణ్..

ఈ రోజు జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో బాలయ్య నిర్మాత సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ ఘన విజయం సాధించింది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 27, 2019, 5:25 PM IST
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పై చేయి సాధించిన బాలయ్య నిర్మాత సి.కళ్యాణ్..
నిర్మాత సి.కళ్యాణ్‌తో బాలయ్య
  • Share this:
ఈ రోజు జరిగిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో బాలయ్య నిర్మాత సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌కు సంబంధించి ప్యానెల్‌కు జరిగిన ఈ ఎన్నికల్లో సి.కళ్యాణ్‌,దిల్ రాజుకు చెందిన ప్యానెల్స్ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికల్లో 12మంది ఈసీ సభ్యులలో సి.కళ్యాణ్‌కు చెందిన మన ప్యానెల్ నుంచి 9 మంది ఎన్నికయ్యారు. దిల్ రాజు‌కు చెందిన యాక్టివ్ ప్యానెల్ నుంచి ఇద్దరు ఎన్నిక కాబడ్డారు. మరోవైపు 20 మంది సెక్టార్ సభ్యుల్లో సి.కళ్యాణ్‌కు చెందిన 16 మంది గెలిచారు. ఇక దిల్‌రాజు ప్యానెల్ నుంచి 4 విజయం సాధించారు. ఈసీ సభ్యులుగా దిల్‌రాజు, దామోదర్ గెలుపొందగా.. స్వతంత్య్ర అభ్యర్ధిగా మోహన్ గౌడ గెలుపుపొందటం విశేషం.

సి.కళ్యాణ్,దిల్ రాజు (ఫైల్ ఫోటోస్)


సి.కళ్యాణ్ రీసెంట్‌గా  తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడిగా  తన సమీప ప్రత్యర్ధి  ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పై 283 ఓట్ల ఆధిత్యతో గెలుపొందిన సంగతి తెలిసిందే కదా.

 

First published: July 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>