Narappa : నారప్ప విడుదల ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది..

‘నారప్ప’గా వెంకటేష్ (Twitter/Photo)

Narappa : విక్టరి వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం నారప్ప.. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించగా..

  • Share this:
    వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తమిళ సినిమా అసురన్‌కు తెలుగు రీమేక్‌గా వస్తున్న చిత్రం 'నారప్ప'. అంతా బాగుంటే ఈ సినిమా మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. కానీ దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఇక ఎప్పుడో రెడీ అయిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలకానుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అంతేకాదు నారప్ప జూలై 24న విడుదలకానుందని ఓ పోస్టర్ కూడా విడుదలైంది. అయితే సరికొత్త పరిణామాల దృష్ట్యా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు తగ్గాయని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదలచేయాలనీ భావిస్తున్నారట. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్ధు చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సిఉంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో పాటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రలో థియేటర్స్ త్వరలో తిరిగి ఓపెన్ కానున్నాయి.

    ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసే నిర్ణయాన్ని మార్చుకుంటున్నారని తెలిసింది. దీనికి తోడు కొన్ని రోజుల క్రితం, తెలంగాణలోని ఎగ్జిబిటర్లు తమ చిత్రాలను ఓటిటిలో విడుదల చేసే విషయాన్ని అక్టోబర్ 30 వరకు వాయిదా వేయాలనీ కోరారు. ఈ ప్రకటన కూడా నారప్ప నిర్మాతల నిర్ణయంపై ప్రభావం చూపోచ్చని అంటున్నారు.

    ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్‌.కె నాయుడు అందిస్తుండగా, సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఎడిటర్ గా మార్తాండ్ కె. వెంకటేష్‌ పని చేస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నారప్ప తమిళ సినిమా 'అసురన్’కు రీమేక్‌గా వస్తోంది. తమిళంలో ధనుష్ నటించిన ఆ సినిమా దళిత నేపథ్య కథతో వచ్చి అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తమిళ మాతృకను వెట్రిమారన్ దర్శకత్వం వహించారు. ధనుష్‌కు జంటగా మళయాల నటి మంజు వారియర్ నటించిగా.. అదే పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించనుంది. అసురన్‌ తమిళ్‌లో హత్తుకునే భావోద్వేగాలతో గ్రామీణ నేపథ్యంలో సాగుతూ హృదయాలను కట్టిపడేస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కడా తగ్గకుండా రూపొందిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.



    ఇక వెంకటేష్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన దృశ్యం 2లో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల అవుతుందని అంటున్నారు. చూడాలి ఏం జరుగనుందో.. ఈ సినిమాతో పాటు వెంకీ.. ఎఫ్ 3లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published: