BULLET SONG LYRICAL RELEASED FROM RAM POTHINENI THE WARRIOR SR
Ram Pothineni | The Warrior : రామ్ పోతినేని ది వారియర్ నుంచి బుల్లెట్ సాంగ్ విడుదల.. అదిరిన రెస్పాన్స్..
Ram Pothineni The Warrior Photo : Twitter
Ram Pothineni | The Warrior : ఈ సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది టీమ్. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి బుల్లెట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు, హరిప్రియ పాడారు. శ్రీమణి రాశారు.
Ram Pothineni - The Warriorr : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)రెడ్ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ లింగుసామితో ‘ది వారియర్’ అంటూ ఓ పోలీస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి (krithi shetty)నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది టీమ్. అందులో భాగంగా తాజాగా ఈ చిత్రం నుంచి బుల్లెట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను కోలీవుడ్ స్టార్ శింబు, హరిప్రియ పాడారు. శ్రీమణి రాశారు. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాట బాగానే ఆకట్టుకుంటోంది. ఇక మరోవైపు తెలుస్తోన్న సమాచారం మేరకు తాజాగా ఈ చిత్రం (The Warriorr) హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ. 16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. . దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ (The Warriorr) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని మూడో షెడ్యూల్‌ను మొదలు పెట్టింది.
ఈ సినిమాలో రామ్ (Ram Pothineni) తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ప్రకటించారు. సమ్మర్లో ఇప్పటికే అన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ కన్ఫామ్ చేసుకోవడంతో రామ్ .. తన సినిమాను జూలై 14న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది.‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni) మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రూపోందనుంది.
ఇక ‘దేవదాసు’ సినిమాతో హీరోగా పరిచమైన రామ్ పోతినేని .. ‘రెడ్’ సినిమా వరకు విలక్షణమైన పాత్రలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇప్పటి యంగ్ హీరోల్లో డాన్స్, ఫైట్స్, యాక్టింగ్‌లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఇస్మార్ట్ హీరోగా ఇరగదీస్తున్నాడు. ఇక ఈయన నటించిన సినిమాలకు హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.‘దేవదాసు’ నుంచి నిన్న మొన్నటి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈయన నటించిన సినిమాలు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కలుపుకుంటే.. 2 బిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. సౌత్‌లో నితిన్ తర్వాత ఈ రికార్డు అందుకున్న రెండో హీరోగా రామ్ పోతినేని నిలిచారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.