‘కాటమరాయుడు’ గిత్త మృతి

కాటమరాయుడు సినిమాలో నటించిన ఎద్దు గురువారం అనారోగ్యంతో మృతి చెందింది.

news18
Updated: June 5, 2018, 12:53 PM IST
‘కాటమరాయుడు’ గిత్త మృతి
కాటమరాయుడు సినిమాలో నటించిన ఎద్దు గురువారం అనారోగ్యంతో మృతి చెందింది.
  • News18
  • Last Updated: June 5, 2018, 12:53 PM IST
  • Share this:
వన్ కళ్యాణ్ హీరోగా డాలి దర్శకత్వంలో వచ్చిన సినిమా  'కాటమరాయడు'. ఈ  సినిమా ప్లాప్ అయ్యినప్పటికీ  ఆ సినిమా పవన్  ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతోంది. ఆ సీనులో పవన్ తో పాటు  ఒంగోలు జాతి గిత్త ఒకటి కనిపించి ఆకట్టుకొంటుంది .

ఆ  సినిమాలో నటించిన ఎద్దు గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. కృష్ణా జిల్లా  ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై గొర్రెపాటి నవనీత కృష్ణ 2014 లో రెండు ఎద్దులను కొని ఘంటసాలపాలేనికి చెందిన వేమూరి రాంబాబు ఆధ్వర్యంలో పెంచుతున్నారు.
ఈ ఎద్దులు కొన్ని ఏళ్లగా  రాష్ట్ర స్థాయిలో జరిగిన ఎద్దుల పోటీల్లో పాల్గొని ఎన్నో ప్రైజులు సాధించాయి . అంతేకాక కాటమరాయుడు సినిమాలో నటించడంతో వీటి క్రేజ్  మరింత పెరిగింది. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక ఎద్దు గురువారం మరణించడంతో చెందటంతో గిత్త కళేబరానికి ప్రత్యేక పూజలు చేసి ఘంటసాలపాలెం గ్రామవీధుల్లో ఊరేగించి శ్మశానవాటికలో అంత్యక్రియలు చేశారు.


 ఒకే రంగులో ఉండే ఈ  గిత్తలను  బ్లాక్‌ బ్రదర్స్‌గా పిలుస్తారు. పశుప్రదర్శన పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్న బ్లాక్‌ బ్రదర్స్‌  'కాటమరాయుడు' సినిమాలో నటించడంతో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అయితే ఈ ఎద్దులు  'కాటమరాయుడు' సినిమాతో పాటు 'సావిత్ర' సీరియల్‌లో కూడా నటించాయి . చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో మూడు షెడ్యూల్‌ షూటింగ్‌లో కూడా పని చేసినట్లు రాంబాబు వివరించారు.

Published by: Sunil Kumar Jammula
First published: June 1, 2018, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading