హోమ్ /వార్తలు /సినిమా /

కొరియాలో ఉర్రూతలూగిస్తున్న 'బుట్ట బొమ్మ' పాట.. వీడియో వైరల్

కొరియాలో ఉర్రూతలూగిస్తున్న 'బుట్ట బొమ్మ' పాట.. వీడియో వైరల్

‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ సాంగ్ (Twitter/Photo)

‘అల వైకుంఠపురములో’ బుట్టబొమ్మ సాంగ్ (Twitter/Photo)

అల వైకుంఠపురములోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' వంటి సాంగ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దటీజ్..స్టైలిష్ స్టార్ బన్నీ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

సంక్రాంతికి విడుదలై దుమ్మురేపిన 'అల వైకుంఠపురములో' సినిమా క్రేజ్ ఖండాతరాలు దాటుతోంది. ఈ మూవీ ఆల్బమ్‌లోని అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డు సృష్టిస్తున్న బుట్టబొమ్మ సాంగ్‌కు విదేశాల్లోనూ యూత్ ఫిదా అవుతోంది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ బుట్టబొమ్మ సాంగ్‌కు డాన్స్‌చేసి టిక్ టాక్‌లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. భారతీయులతో పాటు విదేశీయులు కూడా బుట్టబొమ్మ సాంగ్‌కు, వార్నర్ డాన్స్‌కు ఫిదా అయ్యారు. తాజాగా కొరియాలోనూ బుట్ట బొమ్మ సాంగ్ ఉర్రూతలూగిస్తోంది.

BTS..దక్షిణ కొరియాలో ఫేమస్ బాయ్ బ్యాండ్. దీన్ని బ్యాంగ్టన్ బాయ్స్‌ అని కూడా పిలుస్తారు. 2010లో సియోల్‌లో ప్రారంభమైన బీటీఎస్.. ఇండియన్ సాంగ్స్‌కి మాషప్స్ చేస్తూ ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఈ బాయ్ బాండ్‌లో ఏడుగురు సభ్యులున్నారు. ఇప్పటికే ఎన్నో హిట్స్ సాంగ్స్‌కి డాన్స్ చేసి భారత్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్నారు BTS డాన్సర్స్. తాజాగా 'అల వైకుంఠపురములో' బుట్ట బొమ్మ సాంగ్‌కి కూడా డాన్స్ చేశారు. తమ స్టైల్లో అద్భుతమైన స్టెప్పులు వేసి ఆకట్టుకున్నారు. ఆ వీడియోను ప్రముఖ సింగర్ అర్మన్ మాలిక్ ట్విటర్‌లో షేర్ చేశారు.

అల వైకుంఠపురంలోని 'రాములో రాములా', 'బుట్టబొమ్మ' వంటి సాంగ్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకోవడతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దటీజ్..స్టైలిష్ స్టార్ బన్నీ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

First published:

Tags: Ala Vaikunthapuramulo, Allu Arjun, South korea, Tollywood

ఉత్తమ కథలు