Sudigaali Sudheer: సుడిగాలి సుధీర్‌కి ఊహించిన షాక్‌.. రంగంలోకి పోలీసులు

సుడిగాలి సుధీర్

బుల్లితెర‌పై త‌న కామెడీ టైమింగ్, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌(Sudigali Sudheer)కి ఊహించ‌ని షాక్ త‌గిలింది. హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో బీ బ్లాక్ కాల‌నీలో తాజాగా

  • Share this:
    Sudigaali Sudheer: బుల్లితెర‌పై త‌న కామెడీ టైమింగ్, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్‌కి ఊహించ‌ని షాక్ త‌గిలింది. హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో బీ బ్లాక్ కాల‌నీలో తాజాగా సుధీర్ తన మూవీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ షూటింగ్‌ని అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. క‌రోనా విజృంభ‌ణ స‌మ‌యంలో నివాసాల మ‌ధ్య షూటింగ్‌లు నిర్వ‌హించ‌డంపై స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. అయితే అక్క‌డ షూటింగ్ చేసేందుకు ప‌ర్మిష‌న్ ఉంద‌ని పోలీసులు, స్థానికుల‌కు చెప్పారు. దీంతో పరిస్థితి కాస్త స‌ద్దుమ‌ణిగిన‌ట్లు స‌మాచారం.

    అయితే ఓ వైపు బుల్లితెర‌పై ప‌లు షోల‌లో పాల్గొంటున్న సుధీర్., ప్ర‌స్తుతం కాలింగ్ స‌హ‌స్త్ర అనే మూవీలో న‌టిస్తున్నారు. అజ‌య్ శ్రీవాస్త‌వ అనే పాత్ర‌లో సుధీర్ క‌నిపించ‌నున్నాడు. ఇందుకోసం సుధీర్ చాలా వ‌ర్కౌట్లు చేశాడు. అంతేకాదు గ‌డ్డం కూడా బాగా పెంచాడు. ఆ పాత్ర‌కు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.

    ఇక‌ హార‌ర్ అండ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి అరుణ్ విక్కిరాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాధా ఆర్ట్స్ ప‌తాకంపై ఈ మూవీ తెర‌కెక్కుతోంది. కాగా ఇప్ప‌టికే సుధీర్.. సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే చిత్రాల్లో హీరోగా చేశాడు. అయితే అవేవీ పెద్ద విజ‌యాల‌ను సాధించ‌లేదు. ఈ క్ర‌మంలో కాలింగ్ స‌హ‌స్త్ర మూవీపై సుధీర్ మంచి అంచ‌నాల‌ను పెట్టుకున్నాడు.
    Published by:Manjula S
    First published: