Home /News /movies /

BRAHMASTRA TELUGU KUMKUMALA VIDEO SONG RELEASED SB

Brahmāstra: బ్రహ్మాస్త్రం కుంకుమల వీడియో సాంగ్ రిలీజ్.. అద్భుతంగా పాడిన సిద్ శ్రీరామ్..!

ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" అద్భుతంగా ఆలపించారు. చంద్రబోస్  ఈ పాటకు  సాహిత్యం అందించారు. ఈ పాటను విన్న నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" అద్భుతంగా ఆలపించారు. చంద్రబోస్  ఈ పాటకు  సాహిత్యం అందించారు. ఈ పాటను విన్న నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" అద్భుతంగా ఆలపించారు. చంద్రబోస్  ఈ పాటకు  సాహిత్యం అందించారు. ఈ పాటను విన్న నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

    భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలీవుడ్ లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది.  రాక్ స్టార్ రణబీర్ కపూర్-అలియాభట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు.. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ప‌లువురు స్టార్లు కనిపించనున్నారు.

    తాజాగా "బ్రహ్మాస్త్రం" చిత్ర యూనిట్ "కుంకుమల" వీడియో పాటను విడుదల చేసారు. ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" అద్భుతంగా ఆలపించారు. చంద్రబోస్  ఈ పాటకు  సాహిత్యం అందించారు. ఈ పాటను విన్న నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సిధ్ శ్రీరామ్ ఈ పాటను నెక్ట్స్ లెవల్‌కు తీసుకు వెళ్లాడంటూ చెబుతున్నారు. ఇక బ్రహ్మస్త్ర  సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు. తమిళ్.. మలయాళం.. కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు.తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.



    ఇటీవలే బ్రహ్మస్త్ర ట్రైలర్ విడుదలైంది.  'సకల అస్త్రాలకు దేవత' - ఇదీ 'బ్రహ్మాస్త్ర' సినిమా కాప్షన్. భగవంతుడు, దుష్ట శక్తులకు మధ్య జరిగే యుద్ధమే 'బ్రహ్మాస్త్రం' చిత్ర కథాంశం అంటూ చిత్ర బృందం చెబుతూ వస్తోంది. ఇక విడుదలైన ట్రైలర్ చూస్తే... ఆ యుద్ధం భారీగా ఉండబోతుందని,  ఈ సినిమా ఓ విజువల్ వండర్ అని అర్థం అవుతోంది. 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్‌లో  కథేంటి? అనేది క్లియర్‌గా చెప్పారు. అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది.

    ''నీరు, నిప్పు, వాయువు ప్రాచీన కాలంలో మన మధ్య ఉన్న శక్తులు. అస్త్రాల్లో ఇమిడి ఉన్నాయి. ఈ కథ సకల అస్త్రాలకు దేవత 'బ్రహ్మాస్త్ర' గురించి'' అని అమితాబ్ బచ్చన్ వివరించారు. అప్పుడు వచ్చే విజువల్స్ అబ్బురపరిచేలా ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. దక్షిణాది భాషల్లో ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Alia Bhatt, Brahmastra, Ranbir Kapoor

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు