Home /News /movies /

BRAHMASTRA PROMOTIONS RANBIR KAPOOR INTERESTING COMMENTS ON PRABHAS SLB

Ranbir Kapoor: మై డార్లింగ్ ప్రభాస్.. తెలుగు హీరోలపై రణబీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Photo Twitter

Photo Twitter

Ranbir Kapoor- Prabhas: బ్రహ్మాస్త్ర మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో భాగంగా.. తెలుగులో మీ ఫేవరెట్‌ హీరో ఎవరు అనే ప్రశ్న రణ్‌బీర్‌కు ఎదురైంది. దీంతో ఆయన అందరు తెలుగు హీరోలను చుట్టేస్తూ ఆసక్తికరంగా స్పందించారు.

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), ఆలియా భట్‌ (Alia Bhatt) తొలిసారి జంటగా కనిపించబోతున్న సినిమా బ్రహ్మాస్త్ర (Brahmastra). పాన్‌ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఇప్పటినుంచే చిత్ర ప్రమోషన్స్ షురూ చేసిన బ్రహ్మాస్త్ర టీమ్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నంలో (Vizag) ఓ స్పెషల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మాస్త్ర హీరో రణ్‌బీర్‌ కపూర్, చిత్ర దర్శకుడు అయాన్‌ ముఖర్జీ (Ayan Mukharji) పాల్గొనగా.. టాలీవుడ్ ఫేమస్ దర్శకుడు రాజమౌళి (SS Rajamouli) స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అయితే ఈ మూవీ ప్రమోషన్‌ కార్యక్రమంలో తెలుగులో మీ ఫేవరెట్‌ హీరో ఎవరు అనే ప్రశ్న రణ్‌బీర్‌కు ఎదురైంది. దీంతో ఆయన అందరు తెలుగు హీరోలను చుట్టేస్తూ ఆసక్తికరంగా స్పందించారు.

తెలుగు యాక్టర్స్‌ అందరు కూడా గొప్పవారే అంటూ టాలీవుడ్‌పై ఉన్న ఇష్టాన్ని బయటపెట్టారు రణ్‌బీర్‌ కపూర్‌. త‌న‌కు ప‌వ‌న్ కళ్యాణ్ (Pawan Kalyan) మ్యానిరిజం అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పి అక్కడి వాతావరణంలో జోష్ నింపిన ఆయన.. ఫేవరేట్ హీరో అంటే మాత్రం బాహుబలి స్టార్ ప్రభాస్ (Prabhas) అని అన్నారు. అంతేకాదు మై డార్లింగ్ ప్రభాస్ అంటూ ఆయన స్పందించిన తీరు రెబర్ స్టార్ అభిమానులకు యమ కిక్కిచ్చింది. ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ కూడా అని చెప్పారు రణ్‌బీర్‌ కపూర్.

మొత్తం మూడు భాగాలుగా రాబోతున్న ఈ బ్రహ్మాస్త్ర సినిమాలో బాలీవుడ్‌ కపుల్స్‌ రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ తొలిసారి జంటగా నటిస్తుండటం విశేషం. ఇంకా ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ (Amitabh Bachchan), మౌనీ రాయ్‌‌లతో పాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున భాగమయ్యారు. అన్ని ద‌క్షిణాది భాష‌ల్లో ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి స‌మ‌ర్పిస్తుండటం మరో విశేషం. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై క‌ర‌ణ్ జోహార్‌, ర‌ణ్‌బీర్ క‌పూర్‌, అయాన్ ముఖ‌ర్జీ, అపూర్వ మెహ‌తా, న‌మిత్ మ‌ల్హోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎన్నో గొప్ప గొప్ప కథలు, పురాణ ఇతిహాసాలు ఉన్న మన భారతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలనే ఆలోచన నుంచి పుట్టిన చిత్రమే ఈ బ్రహ్మస్త్ర అని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంటున్నారు. చిన్నప్పటినుంచి విన్న కథలు, ప్రాచీన భారతీయ సంస్కృతి మూలాలు ఈ సినిమాకి ఆధారం అని ఆయన చెబుతున్నారు. సో.. ఈ బ్రహ్మాస్త్రలో ఏం చూపించబోతున్నారనేది తెలియాలంటే సెప్టెంబర్ 9 వరకు ఆగాల్సిందే మరి!.
Published by:Sunil Boddula
First published:

Tags: Brahmastra, Prabhas, Ranbir Kapoor, SS Rajamouli

తదుపరి వార్తలు