Brahmastra Trailer : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్యాన్ ఇండియా మూవీస్ అంటే అందరికీ తెలిసొచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘కేజీఎఫ్, పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2’ సినిమాలు ప్యాన్ ఇండియా రఫ్పాడించాయి. ఈ సినిమాలు ఇచ్చిన ఇన్స్ప్రిరేషన్తో వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో నాగార్జున, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ -1ను 9 సెప్టెంబర్ 2022న విడుదల చేస్తున్నారు.
‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని రిలీజ్ చేస్తున్నారు. చేతిలో త్రిశూలంతో వెనకాల మహాదేవుడు పరమశివుడున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని పోస్టర్లో ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అనే అర్ధం. మన పురాణా ఇతిహాసలైన రామాయణ, మహా భారతంలో బ్రహ్మాస్త్రం గురించి వివరాలున్నాయి. ఇపుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
'BRAHMASTRA' TRAILER ON 15 JUNE... #RanbirKapoor, #SSRajamouli and director #AyanMukerji make a surprise announcement: Trailer of #Brahmāstra Part One: #Shiva to unveil on 15 June 2022, almost *three months before* its release... In *cinemas* 9 Sept 2022 in multiple languages. pic.twitter.com/o7UzsFEW27
— taran adarsh (@taran_adarsh) May 31, 2022
‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 19 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీలో నాగార్జున నటిస్తోన్న చిత్రం ఇదే. టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి, ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవ్వరైనా ఉన్నారంటే అది కచ్చితంగా అక్కినేని నాగార్జుననే. తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన ‘శివ’ సినిమా హిందీ రీమేక్ చిత్రంతో 1990లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ్. ఆ తర్వాత ‘ద్రోహి’, ‘ఖుదా గవా’, ‘క్రిమినల్’, ‘జక్మ్’ వంటి హిందీ సినిమాల్లో నటించారు. 2003లో వచ్చిన ‘ఎల్.ఓ.సీ కార్గిల్’ హిందీ సినిమాలో చివరిసారిగా ఓ పాత్రలో నటించారు నాగార్జున. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ తెరపై ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా ఇతరత్రా సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైయింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను ఆర్ఆర్ఆర్ తరహాలో ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాసల్లో విడుదల చేయనున్నారు. అప్పటికే వివిధ భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసారట. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఉండేవారు. ఈ సినిమానకు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించారు.
RRR : ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు.. జీ5 ఓటీటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ సంచలనం..
మునుపెన్నడూ ఇండియన్ స్క్రీన్‌పై చూడని ఓ అద్భుతమైన విజువల్ ఫీస్ట్ ఈ సినిమా రానుంది. బ్రహ్మాస్త్ర 3-భాగాల ఫ్రాంచైజీగా రానుంది. మొట్టమొదటి అసలైన విశ్వం ఆస్ట్రావర్స్కు నాంది. ఇది భారతీయ పురాణాలలో లోతుగా పాతుకుపోయిన భావనలు, కథల నుంచి ప్రేరణ పొందిన ఒక కొత్త అసలైన సినిమా విశ్వం.. దాన్నే అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో చేస్తున్నారు. ఫాంటసీ, అడ్వెంచర్, మంచి vs చెడు, ప్రేమ, పురాణ కథాంశంతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంటుంది. మొత్తంగా రణ్‌బీర్ కపూర్, నాగార్జునలకు ఇదే తొలి ప్యాన్ ఇండియా మూవీ అనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Alia Bhatt, Amitabh bachchan, Bollywood news, Brahmastra, Nagarjuna Akkineni, Ranbir Kapoor