హోమ్ /వార్తలు /సినిమా /

Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్‌ల ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ప్రకటన..

Brahmastra : రణ్‌బీర్ కపూర్, నాగార్జున, అమితాబ్‌ల ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్ డేట్ ప్రకటన..

‘బ్రహ్మాస్త్ర’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్  (Twitter/Photo)

‘బ్రహ్మాస్త్ర’ మూవీ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ (Twitter/Photo)

Brahmastra | రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో  నాగార్జున, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.

    Brahmastra : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమాతో ప్యాన్ ఇండియా మూవీస్‌ అంటే అందరికీ తెలిసొచ్చింది. రాజమౌళి, ప్రభాస్ రగిలించిన ప్యాన్ ఇండియా ఫీవర్‌ను కంటిన్యూ చేసిన మూవీ ‘కేజీఎఫ్’.  ప్రశాంత్ నీల్ దర్శత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన ‘కేజీఎఫ్’ కూడా ప్యాన్ ఇండియా లెవల్లో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా. ఈ సినిమాలు ఇచ్చిన ఇన్‌స్ప్రిరేషన్‌తో  వివిధ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఈ కోవలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమాలో  నాగార్జున, అమితాబ్‌ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయాన్ ముఖర్జీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ -1ను 9 సెప్టెంబర్  2022న విడుదల చేస్తున్నట్టు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

    ‘బ్రహ్మాస్త్ర’లో రణ్‌బీర్ కపూర్.. ‘శివ’ పాత్రలో నటిస్తున్నారు. మొదటి భాగానికి ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 1 శివ’ అని రిలీజ్ చేస్తున్నారు. చేతిలో త్రిశూలంతో వెనకాల మహాదేవుడు పరమశివుడున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ ‘సారే అస్త్రే కే దేవతా’ అని పోస్టర్‌లో ఉంది. బ్రహ్మాస్త్రం అనేది తిరుగులేని అస్త్రం అనే అర్ధం. మన పురాణా ఇతిహాసలైన రామాయణ, మహా భారతంలో బ్రహ్మాస్త్రం గురించి వివరాలున్నాయి. ఇపుడు ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కించారు.

    ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో  టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 18 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత హిందీలో నాగార్జున నటిస్తోన్న చిత్రం ఇదే. టాలీవుడ్ సీనియర్ హీరోలలో బాలీవుడ్లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసి, ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవ్వరైనా ఉన్నారంటే అది కచ్చితంగా అక్కినేని నాగార్జుననే.

    Balakrishna - Rajamouli : నాతో సినిమా ఎపుడు చేస్తావ్.. రాజమౌళికి బాలకృష్ణ సూటి ప్రశ్న.. అదిరిన జక్కన్న సమాధానం..

    తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన ‘శివ’ సినిమా హిందీ రీమేక్ చిత్రంతో 1990లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నాగ్. ఆ తర్వాత ‘ద్రోహి’, ‘ఖుదా గవా’, ‘క్రిమినల్’, ‘జక్మ్’ వంటి హిందీ సినిమాల్లో నటించారు. 2003లో వచ్చిన ‘ఎల్.ఓ.సీ కార్గిల్’ హిందీ సినిమాలో చివరిసారిగా ఓ పాత్రలో నటించారు నాగార్జున. మళ్లీ ఇప్పుడు బాలీవుడ్ తెరపై ఆర్కియాలజీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

    అబ్బాయి రానాతో కాకుండా.. మరో స్టార్ హీరోతో వెంకటేష్ మల్టీస్టారర్ మూవీ..

    2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్ కరోనా ఇతరత్రా సమస్యల కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అయింది. కొంచెం ప్యాచ్ వర్క్ మినహా ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైయింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను ఆర్ఆర్ఆర్ తరహాలో ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాసల్లో విడుదల చేయనున్నారు. అప్పటికే వివిధ భాషల్లో ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసారట. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఉండేవారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా వివిధ భాషల్లో 10 టీజర్లు, 13 మోషన్ పోస్టర్స్ విడుదల చేసే పనిలో ఉన్నారట. ఇప్పటికే ఆయా భాషల్లో టీజర్స్ కట్ చేసి అక్కడ స్థానిక సెన్సార్ సభ్యులు ఓకే చెబితే.. వెంటనే ప్రచారం మొదలు పెట్టనున్నారు. మొత్తంగా రణ్‌బీర్ కపూర్, నాగార్జునలకు ఇదే తొలి ప్యాన్ ఇండియా మూవీ అనే చెప్పాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Alia Bhatt, Amitabh bachchan, Ayan Mukerji, Bollywood news, Brahmastra, Nagarjuna Akkineni, Ranbir Kapoor, Tollywood

    ఉత్తమ కథలు