హోమ్ /వార్తలు /సినిమా /

Brahmastra: వైజాగ్‌లో రణ్‌బీర్ కపూర్.. బ్రహ్మస్త్ర కోసం బిజీబిజీగా..!

Brahmastra: వైజాగ్‌లో రణ్‌బీర్ కపూర్.. బ్రహ్మస్త్ర కోసం బిజీబిజీగా..!

‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్ డేట్ (Twitter/Photo)

‘బ్రహ్మాస్త్ర’ మూవీ రిలీజ్ డేట్ (Twitter/Photo)

తన సినిమా ప్రమోషన్ కోసం బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ వైజాగ్ చేరుకున్నాడు. దీంతో రణ్ బీర్‌ను చూసేందుకు ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ చిత్రం `బ్రహ్మాస్త్ర`(Brahmastra). రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ (Alia Bhatt) జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌(Amithab Bachchan, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున(Nagarjuna), మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో భాగంగా మొదటి భాగం `బ్రహ్మాస్త్ర పార్ట్ వన్‌ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ టీజర్ ను రిలీజ్ చేశారు.

  అయితే తాజాగా బ్రహ్మస్త్ర టీమ్.. ప్రమోషన్లలో భాగంగా వైజాగ్ వచ్చింది. ఈ సినిమా హీరో రణబీర్‌ కపూర్‌తో పాటు ఈ సినిమా దర్శకుడు అయాన్‌ ముఖర్జి, టాలీవుడ్ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాను రాజమౌళి సమర్పిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఉదయం ఎయిర్‌పోర్ట్‌లో బైక్‌ ర్యాలీ జరిగింది. మధ్యాహ్నం మెలోడీ థియేటర్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌ చిత్ర బృందం పాల్గొంది.

  రొమాంటిక్ సాంగ్ ‘కుంకుమలా’ టైటిల్ తో ఫస్ట్ సింగిల్ టీజర్ ను తాజాగా తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేశారు. హిందీలో నెల కొందనే రణ్‌బీర్ , అలియా భట్ వెడ్డింగ్ కానుకగా ‘కేసరియా’ టైటిల్ తో రిలీజ్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ సాంగ్ టీజర్ ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తాజాగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘బ్రహ్మాస్త్రం : పార్ట్ వన్ నుంచి ‘కుంకుమలా’ సాంగ్ ప్రొమోను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి’ అంటూ ట్వీట్ చేశారు.

  ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఈ రొమాంటిక్ సాంగ్ కు హిందీలో అమిత్ భట్టాచార్య లిరిక్స్ అందించగా.. తెలుగులో చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యం అందించారు. హిందీలో స్టార్ సింగర్ ఆర్జిత్ సింగ్ పాడిన ఈ పాటను.. తెలుగులో ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Alia Bhatt, Brahmastra, Ranbir Kapoor, Vizag

  ఉత్తమ కథలు