BRAHMANANDAM SON GAUTAM COMING UP WITH AN ANOTHER DIFFERENT SCRIPT PK
Brahmanandam son Gautam: సరికొత్తగా వస్తున్న బ్రహ్మానందం తనయుడు గౌతమ్..
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ కొత్త సినిమా (gautam movie)
Brahmanandam son Gautam: బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పటి వరకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. కాకపోతే విభిన్నమైన కథలు ప్రయత్నిస్తాడనే పేరు మాత్రం సంపాదించుకున్నాడు.
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాకపోతే ఇప్పటి వరకు సరైన గుర్తింపు మాత్రం రాలేదు. కాకపోతే విభిన్నమైన కథలు ప్రయత్నిస్తాడనే పేరు మాత్రం సంపాదించుకున్నాడు. కొన్నేళ్లుగా ఆయన చేస్తున్న సినిమాలే ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తాయి. మొదటి సినిమా పల్లకిలో పెళ్లికూతురు తర్వాత.. ఆ తర్వాత బసంతి, మను లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈయన హీరోగా రూపొందతున్న సినిమా గ్లిమ్స్ని గౌతమ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో టాలీవుడ్ ప్రత్యేక ముద్రను వేసుకున్న యస్ ఓరిజినల్స్ బ్యానర్ నుంచి ప్రోడక్షన్ నెం 10గా నిర్మిస్తున్న ఈ సినిమాతో సుబ్బు చెరుకూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఒక బ్లాంక్ స్క్రీన్‌పై వాయిస్ మొదలవతుంది. ఒంటరి తనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అనే డైలాగ్‌తో గౌతమ్ లుక్ రిలీవ్ అవుతుంది.
ఈ డైలాగ్‌లో గౌతమ్ క్యారెక్టర్‌లోని పెయిన్ తెలుస్తుంది. అలాగే లుక్స్ కూడా రచయిత క్యారెక్టర్ని ఫరెఫెక్ట్గా మ్యాచ్ చేసే విధంగా ఉన్నాయి. ఆర్టిస్ట్‌గా మనుతో సర్ప్రైజ్ చేసిన గౌతమ్ ఈ సారి మరో కొత్త ఎక్స్ పీరియన్స్ ప్రేక్షకులకు అందించబోతున్నాడు. మోనోఫోబియాతో బాధ పడుతున్న రచయితగా కనిపిస్తున్నాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది..?
తను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని అతను ఎలా అధిగమించాడు అనేది థ్రిలింగ్ ఉండబోతుంది అని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ కాన్సెప్ట్‌ని యునిక్‌గా తెరకెక్కిచడంలో సుబ్బు చెరుకూరి తన దైన ముద్రను వేసాడని చిత్ర యూనిట్ అంటుంది. ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిషెడ్యూల్ జరుపుకుంటుంది. ఎమ్ యస్ జోన్స్ రూపెర్ట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి మోహన్ చారి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిర్మాత సృజన్ యరబోలు, దర్శకత్వం సుబ్బు చెరుకూరి.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.