Home /News /movies /

BRAHMAJI SON SANJAY RAO SLUM DOG HUSBAND MOTION POSTER RELEASE SLB

కుక్కతో లచ్చిగాని పెళ్లి.. అందరూ ఆహ్వానితులే! ఇదెక్కడి విడ్డూరం బాబోయ్..

Photo Twitter

Photo Twitter

Slum Dog Husband: డిఫరెంట్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ ఓ సరికొత్త ఆలోచన చేసి 'స్లమ్‌డాగ్ హస్బండ్‌' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ వదిలి జనాల్లో ఆసక్తి రేకెత్తించాడు.

ఇంకా చదవండి ...
కుక్కకు మనిషికి పెళ్లి.. ఈ మాట విని ఆశ్చర్యపోకండి గురూ!. మీరు విన్నది, చూసింది నిజమే. లచ్చిగానికి కుక్కతో పెళ్లి చేశారు. ఆ లచ్చిగాడు ఎవరో కాదు టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు (Actor Brahmaji Son). అవునండీ.. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావుకు (Sanjay Rao) కుక్క (Dog) తో పెళ్లి చేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాకపోతే ఇది రియల్ పెళ్లి కాదు రీల్ వెడ్డింగ్. డిఫరెంట్ కథలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే పూరి జగన్నాథ్ (Puri Jagannadh) శిష్యుడు డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ (AR Sridher) ఈ సరికొత్త ఆలోచన చేసి ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు. కథకు సరిగ్గా యాప్ట్ అయ్యేలా దీనికి 'స్లమ్‌డాగ్ హస్బండ్‌' (Slum Dog Husband) అనే పేరు కూడా ఫిక్స్ చేసేశాడు. ఈ మేరకు చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ వదిలి జనాల్లో ఆసక్తి రేకెత్తించాడు.

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు 'ఓ పిట్టకథ' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆడియన్స్ మెప్పు పొందింది. సినిమాలోని ట్విస్టులు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో అలాంటి డిఫరెంట్ కథల వేటలో ఉన్న సంజయ్ రావుకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్‌ ఏఆర్‌ శ్రీధర్‌ తోడయ్యాడు. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ ఇప్పటివరకు ఎన్నడూ చూడని సరికొత్త జానర్‌లో 'స్లమ్‌డాగ్ హస్బండ్‌' అనే మూవీ రూపొందిస్తున్నారు.

అక్కిరెడ్డి, వెంకట్‌ అన్నపు రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రణవి నటిస్తోంది. అయితే నేడు (మే 29) సంజయ్‌ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ రిలీజ్ చేశారు. హీరో దగ్గుబాటి రానా చేతుల మీదుగా విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ కేవలం 47 సెకనుల నిడివితోనే సినిమాపై ఆసక్తి నెలకొల్పింది. ఇందుకు ప్రధాన కారణం కుక్కతో హీరో పెళ్లి అనే కాన్సెప్ట్.

వివాహాల్లో కొందరు పాటిస్తున్న కొన్ని మూఢనమ్మకాలను బేస్ చేసుకొని వినోదాత్మకంగా ఈ కథను అల్లాడు నూతన దర్శకుడు ఏఆర్‌ శ్రీధర్‌. లచ్చిగాని పెళ్లి ఇక పార్శీగుట్టల లొల్లి అనే మాస్ బీట్‌ జోడించి వదిలిన ఈ మోషన్ పోస్టర్‌లో కుక్కతో హీరో పెళ్లి జరిగినట్లు స్పష్టమవుతోంది. అంతేకాదు వీడియో చివరలో ఈ పెళ్ళికి అందరూ ఆహ్వానితులే అంటూ ఓ కార్డు వేసి సినిమాలో ఏదో డిఫరెంట్ కోణం ఉందని హింటిచ్చాడు డైరెక్టర్. ఎంతైనా పూరి శిష్యుడు కదా ఆ మాత్రం వెరైటీ కామనే మరి. కాకపోతే ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు? బ్రహ్మాజీ తనయుడికి ఈ మూవీ  టర్నింగ్ పాయింట్ కానుందా? అనేదే జనాల్లో చర్చనీయాంశం అయింది.
Published by:Sunil Boddula
First published:

Tags: Rana daggubati

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు