హోమ్ /వార్తలు /సినిమా /

Salman Khan Radhe: సల్మాన్ ఖాన్ ‘రాధే’కు కొత్త చిక్కులు.. మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పిలుపు..

Salman Khan Radhe: సల్మాన్ ఖాన్ ‘రాధే’కు కొత్త చిక్కులు.. మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్స్ పిలుపు..

అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇద్దరం కలిసే ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. ఈ మధ్యే విడుదలైన రాధే సినిమాలోనూ కలిసి నటించారు. ఇందులో సల్మాన్ సుపీరియర్‌గా నటించారు జాకీ ష్రాఫ్. ఏదేమైనా కూడా జాకీ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

అప్పట్నుంచి ఇప్పటి వరకు ఇద్దరం కలిసే ప్రయాణం చేస్తున్నామని చెప్పారు. ఈ మధ్యే విడుదలైన రాధే సినిమాలోనూ కలిసి నటించారు. ఇందులో సల్మాన్ సుపీరియర్‌గా నటించారు జాకీ ష్రాఫ్. ఏదేమైనా కూడా జాకీ ష్రాఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Salman Khan Radhe: సల్మాన్ ఖాన్ ‘రాధే’కు కొత్త చిక్కులు.. ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది నెటిజన్స్ పిలుపు నిచ్చారు. 

  Salman Khan Radhe: సల్మాన్ ఖాన్ ‘రాధే’కు కొత్త చిక్కులు.. ఈ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది నెటిజన్స్ పిలుపు నిచ్చారు.  కరోనా లేకపోయి ఉంటే.. ఈ సినిమా గతేడాదే విడుదలై ఉండేది. కానీ ఈ సినిమాను ఈద్ సందర్భంగా మే 13 తేదిన విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న ఈ సమయంలో ఈ చిత్రాన్ని  ఒకేసారి థియేటర్స్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. జీ 5లో పే ఫర్ వ్యూ ఆధారంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రీసెంట్‌గా  ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన దిశా పటానీ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాను చూడొద్దంటూ  సోషల్ మీడియా వేదికగా దాదాపు 35 వేలకు పైగా ట్వీట్స్ ట్రెండ్ అవుతున్నాయి. మొత్తంగా సోషల్ మీడియా వేదికగా కొంత మంది కావాలనే ఈ సినిమాను దుష్ప్రచారం చేస్తున్నారని సల్మాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు.

  ‘రాధే’ సినిమాను  ప్రభుదేవా  డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘వాంటెడ్’. ఈ సినిమాకు ముందు సల్మాన్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ‘పోకిరి’ రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు సల్మాన్‌ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సల్మాన్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత మరోసారి ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేసాడు. ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో నడవలేదు.

  పైగా ఈ సినిమాకు ప్యూర్ రివ్యూ రేటింగ్స్ వచ్చాయి. ‘టైగర్ జిందా హై’ తర్వాత సల్మాన్ ఖాన్.. సినిమా ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. ఆ తర్వాత రిలీజైన ‘రేస్ 3’ ‘భారత్’‘దబాంగ్ 3’ బ్యాడ్ టాక్ వచ్చినా.. మంచి వసూళ్లనే దక్కించుకున్నాయి.రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే.. ప్రభుదేవా ఈ సినిమాను పోకిరి సినిమాకు సీక్వెల్ తీసినట్టు కనబడుతోంది.  ‘రాధే’ సినిమాకు ట్యాగ్ లైన్‌గా ‘యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ అని ఉంది. మొత్తంగా కరోనా వేళ సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాకు నెటిజన్స్ నుంచి ఊహించని షాకే తగిలింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bollywood, Disha Patani, Salman khan

  ఉత్తమ కథలు