Radhika Apte: 5 ఏళ్ళ తర్వాత రాధిక ఆప్టేపై ట్రోల్.. ఈవిడతో సినిమాలే చేయద్దంటూ దారుణంగా?

Radhika Apte

Radhika Apte: టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో రంగస్థలం మీద నటించిన రాధిక ఆ తర్వాత ఇండస్ట్రీకి పరిచయం అయింది.

  • Share this:
    Radhika Apte: టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో రంగస్థలం మీద నటించిన రాధిక ఆ తర్వాత ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇక తెలుగులో 2010లో విడుదలైన రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య నటించిన లెజెండ్, లయన్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా కబాలి సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.

    ఇక 2005లోనే వాహ్!! లైఫ్ హో తో హసీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. కెరీర్ మొదట్లో మంచి మంచి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా హిందీలో పలు సినిమాలలో నటించింది. కానీ ఈమధ్య తనపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. కారణం న్యూడ్ సినిమాలలో నటించడంతో.. తనపై ప్రేక్షకులు తెగ మండిపడుతున్నారు. ఇక ఈమె నటించిన సినిమా పార్చ్ డ్ 2016 లో విడుదల అయింది. ఇక ఇప్పటికి అయిదేళ్ళు కాగా తాజాగా ఆమెను సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

    ఆమె నటించిన ఈ సినిమా స్త్రీ యొక్క చదువులపై, గ్రామాలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలతో తెరకెక్కింది. ఇక ఈ సినిమా పట్ల కొన్ని విమర్శలు ఎదుర్కొంది. దీంతో తాజాగా మళ్లీ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఆ సన్నివేశాలను చూసిన నెటిజనులు తనపై తెగ మండిపడుతున్నారు. ఇటువంటి వాళ్లతో సినిమాలు చేయకూడదు అంటూ.. ఆమె నటించిన సినిమాలు ఎవరు చూడకూడదని సోషల్ మీడియాలో బాగా ఫైర్ అవుతూ ప్రచారాలు చేస్తున్నారు నెటిజన్లు. ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వ్యతిరేకంగా చూపించే సినిమాలలో నటిస్తుందని.. సోషల్ మీడియా మాధ్యమాలలో #boycottRadhikaApte అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈమె గురించి వస్తున్న విమర్శలు బాగా వైరల్ గా మారాయి.
    Published by:Navya Reddy
    First published: