Home /News /movies /

BOYCOTT LAAL SINGH CHADDHA IS TRENDING ON TWITTER SB

Laal Singh Chadda: నాగచైతన్య, అమీర్ ఖాన్ సినిమాకు కొత్త తలనొప్పి...?

’లాల్ సింగ్ చడ్డా’లో బాలరాజుగా నాగ చైతన్య (Twitter/Photo)

’లాల్ సింగ్ చడ్డా’లో బాలరాజుగా నాగ చైతన్య (Twitter/Photo)

బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ కొందరు ఈ సినిమాపై ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

    ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీతో నాగచైతన్య తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో ఒకేసారి హిందీ, తెలుగు పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగులో  ఈ సినిమాకు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక చిరు తన కెరీర్‌లో ‘రుద్రవీణ’, త్రినేత్రుడు’ సినిమాల తర్వాత సమర్పకుడిగా వ్యవహరిస్తోన్న మూడో  చిత్రం ఆమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ కావడం విశేషం.

    తాజాగా ఈ సినిమాలో నాగ చైతన్య పాత్రకు సంబంధించిన లుక్‌‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య ‘బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చైతూ దక్షిణాదికి చెందిన యువకుడి పాత్రలో కనిపించనున్నారు. పైగా తన తాత అక్కినేని నాగేశ్వరరావుకు స్టార్‌డమ్ తీసుకొచ్చిన ‘బాలరాజు’ పాత్రలో ‘లాల్ సింగ్ చడ్దా’ లో కనిపించడం విశేషం.



    బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరో అమీర్ ఖాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “లాల్ సింగ్ చడ్డా”. అయితే ఈ సినిమా కోసం అందరికీ తెలిసిందే. అమీర్ నటించిన ఈ సినిమాని మేకర్స్ భారీ హైప్ తో తెరకెక్కించారు. అయితే ఎప్పుడూ లేనిది ఆమీర్ కూడా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్నాడు ఇటు టాలీవుడ్‌కు కూడా వచ్చి ప్రమోషన్లు చేసుకున్నాడు. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త రచ్చ వైరల్ గా మారుతుంది.

    బాయ్‌కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ కొందరు ఈ సినిమాపై ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమాని బ్యాన్ చెయ్యాలని ఈ సినిమాలో నటీనటులు మతపరమైన పలు అనుచిత కామెంట్స్, చేష్టలు చేసారని అప్పటి వీడియోలు ఇంటర్వ్యూ క్లిప్స్ తో నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు. దీనితో ఇపుడు ఈ అంశం నేషనల్ వైడ్ కూడా ట్రెండ్ గా మారింది. అయితే ఆమీర్ పై అయితే మరింత స్థాయిలో కామెంట్స్ వినిపిస్తున్నా తాను గతంలో చేసిన దంగల్ సినిమా రిలీజ్ పాకిస్తాన్ లో ఉన్నపుడు సినిమాలో గాని భారత దేశ జెండా గాని జాతీయ గీతం సన్నివేశం లేకుండా అక్కడ రిలీజ్ చేసేలా ఉంటే పాకిస్తాన్ రిలీజ్ చెయ్యనని చెప్పాడని అలాంటి అమీర్ పై ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారని అభిమానులు అంటున్నారు. మొత్తానికి అయితే ఇపుడు లాల్ సింగ్ చడ్డా పై మాత్రం నేషనల్ లెవెల్లో ఈ నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Aamir Khan, Laal Singh Chaddha, Naga Chaitanya

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు