దీపికాకు జెఎన్‌యూ సెగ.. ‘చఫాక్’ మూవీ బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్స్..

దేశ రాజధాని ఢిల్లీలో నెలవైన జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. దీంతో ఆమె నటించిన ‘ఛపాక్’ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 8, 2020, 10:27 AM IST
దీపికాకు జెఎన్‌యూ సెగ.. ‘చఫాక్’ మూవీ బాయ్‌కాట్ చేయాలంటున్న నెటిజన్స్..
ఢిల్లీ జేఎన్‌యూలో దీపీకా పదుకొణే.(Twitter/Photo)
  • Share this:
దేశ రాజధాని ఢిల్లీలో నెలవైన జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు హింసాత్మక ఘటనలను నిరసిస్తూ.. జేఎన్‌యూ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కూడా పాల్గొన్నారు. ఐతే దీపికా జేఎన్‌యూకు వెళ్లడంపై బీజేపీ నేత తేజెందర్ బగ్గా మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శలు గుప్పించారు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు ఆమె నటించిన లేటెస్ట్ మూవీ ‘చఫాక్’ మూవీని బాయ్‌కాట్ చేయాలంటూ  ట్విట్లర్‌లో ‘బాయ్‌కాట్ ఛపాక్’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను  ట్రెండింగ్ చేస్తున్నారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తానన్న కన్నయ్య కుమార్‌ను దీపికా కలవడం దేనికి సంకేతం అంటూ మరో వర్గం వారు ఆరోపిస్తున్నారు. అంతేకాదు దీపిక చర్యను తప్పుపడుతూ తాము ‘ఛపాక్’ సినిమాను చూడబోమన్నారు. అంతేకాదు ఇప్పటికే బుక్ చేసుకున్న టిక్కెట్స్‌ను క్యాన్సిల్ చేసుకుంటామని నెటిజన్స్ అంటున్నారు.

జేఎన్‌యూ క్యాంపస్‌లో దీపికా పదుకొణె


ఆదివారం జేఎన్‌యూ క్యాంపస్‌లో హింస చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో హాస్టల్స్‌లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో జేఎన్‌ఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ సహా 40 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో జేఎన్‌యూలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఐతే జేఎన్‌యూలో హింసకు ఏబీవీపీయే కారణమని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు లెఫ్ట్ విద్యార్ధి సంఘాలా వారే ఈ పని చేసారని ఏబీవీపీ వారు వాదిస్తున్నారు. మరోవైపు జేనెయూ ఘటన మా వాళ్లే చేసారని ఓ వర్గానికి చెందిన వారు చెప్పుకున్నారు. మొత్తానికి దాడులకు బాధ్యులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 8, 2020, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading