బాలయ్య‌ సరసన నటించే కొత్త అమ్మాయి ఆమెనట..

Balakrishna : బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్ కాకుండా, కొత్త హీరోయిన్ కనిపిస్తుందని బోయపాటి క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: July 11, 2020, 11:26 AM IST
బాలయ్య‌ సరసన నటించే కొత్త అమ్మాయి ఆమెనట..
బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/Photo)
  • Share this:
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో BB3 అనే వర్కింగ్ టైటిల్‌ పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి రకరకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగమ్మాయి అంజలితో పాటు మరో కీలక పాత్రలో శ్రియ సరన్ నటిస్తుందని రూమర్స్ వినపడ్డాయి. అయితే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని.. బోయపాటి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. బాలయ్య సినిమాలో హీరోయిన్ ఎవరనే టాపిక్ పై రోజుకో డిస్కషన్ నడుస్తోంది. తాజాగా అమలాపాల్ పేరు కూడా తెరపైకొచ్చింది. అయితే ఈ డిస్కషన్ ను కొట్టి పారేస్తున్నాడు బోయపాటి. బాలయ్య సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నామని ఇప్పటికే ప్రకటించిన బోయపాటి.. అదే మాటకు కట్టుబడి ఉన్నాడట. బాలయ్య సరసన క్రేజీ హీరోయిన్ కాకుండా, కొత్త హీరోయిన్ కనిపిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు కొత్త హీరోయిన్ సెలక్షన్ ప్రాసెస్ కూడా పూర్తయిందట. ఒక అందమైన మోడల్ బాలకృష్ణ సరసన నటించనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుంది.

ఇక ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా. గతంలో వీరి కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. బోయపాటి బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మొదటి సినిమా ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో ‘లెజెండ్’.. 'సింహ'ను మించి విజయం అందుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత వస్తోన్న ఈ తాజా సినిమా ‘లెజెండ్’ను మించిన హిట్ అవ్వాలనీ బాలయ్య ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయ్యిందని.. మోనార్క్ పేరుతో ఈ సినిమా రాబోతుందని అన్నారు. అయితే తాజాగా ‘సూపర్ మ్యాన్’ అనే మరో టైటిల్ కూడా బాగా వినిపిస్తోంది. పైగా గతంలో ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా కూడా చేశారు. అంతేకాదు ఈ కథకు ‘సూపర్ మ్యాన్’ అనే టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుందట. అందుకే బోయపాటి కూడా ఈ టైటిల్ పై ఇంట్రస్ట్ గా ఉన్నాడని సమాచారం. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
Published by: Suresh Rachamalla
First published: July 11, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading