BOYAPATI SRINU TO WORK WITH KOLLYWOOD STAR HERO SURIYA AFTER BALAKRISHNA BB3 MOVIE TA
Boyapati Srinu: కోలీవుడ్ స్టార్ హీరోతో బోయపాటి శ్రీను ప్యాన్ ఇండియా మూవీ..
బోయపాటి శ్రీను (File/Photo)
Boyapati Srinu: ప్రస్తుతం దర్శకుడు బోయపాటి శ్రీను నందమూరి నట సింహం బాలకృష్ణతో ‘BB3’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ హీరోతో ప్యాన్ ఇండియా మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
Boyapati Srinu:ప్రెజెంట్ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బి.గోపాల్,వి.వి.వినాయకల తర్వాత మాస్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శకుడుబోయపాటి శ్రీను. ఇప్పటి వరకు అందరు బడా స్టార్ హీరోలతో సినిమాలు తీసాడు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్‌తో మాత్రమే ‘జయ జానకి నాయక’ సినిమా తీసి హిట్ అందుకున్నాడు.ప్రస్తుతం తెలుగులో మాస్ డైరెక్టర్‌గా తనకంటూ సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. బోయపాటి శ్రీను మూవీ అంటే మాస్ ప్రేక్షకులకు పండగనే. ప్రస్తుతం ఈయన నందమూరి నట సింహం బాలకృష్ణతో ‘BB3’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు.మరోవైపు బోయపాటి శ్రీను బాలయ్య మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో ప్యాన్ ఇండియా యాక్షన్ మూవీ చేయనున్నట్టు చెన్నై ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
బోయపాటి శ్రీను,సూర్య (File/Photo)
ఇప్పటికే బోయపాటి శ్రీను చెప్పిన కథకు సూర్య ఓకే చెప్పినట్టు సమాచారం. సూర్య కూడా ‘సింగం’ తరహాలో ఓ మాస్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. గత కొంత కాలంగా సూర్య పూర్తి స్థాయి మాస్ సినిమాలు చేయలేదు.
బోయపాటి శ్రీను,సూర్య (File/Photo)
ఇక బోయపాటి శ్రీను సినిమాతో మాస్ హీరోగా మరోసారి నట విశ్వరూపం చూపించాలనే ఆలోచనలో ఉన్నాడు. మొత్తంగా వీరి కాంబినేషన్లో తెరకెక్కేబోయే ఈ సినిమాపై త్వరలో అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాను తెలుగు, తమిళంలో తెరకెక్కించి హిందీ, కన్నడలో ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. మరోవైపు బోయపాటి శ్రీను.. అల్లు అర్జున్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.