హోమ్ /వార్తలు /సినిమా /

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖరారు

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖరారు

 ‘వినయ విధేయ రామ’మూవీలో రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటో)

‘వినయ విధేయ రామ’మూవీలో రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటో)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తేదిని అఫీషియల్‌గా ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా..మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో డివివి దానయ్య ఈ మూవీని భారీ ఎత్తన నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీటైంది.

  ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫైనల్ దశకు చేరుకున్నాయి. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేయనున్నారు.

  వినయ విధేయ రామలో రామ్ చరణ్

  తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 27న హైదరాబాద్ యూసుఫ్ గుడాలోని పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్టు ఈ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.

  రామ్ చరణ్ వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్

  ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. హీరోగా రామ్‌చరణ్‌కు ఇది 12వ సినిమా.

  ‘వినయ విధేయ రామ’లో రామ్ చరణ్

  దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీలో చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

  ‘వినయ విదేయ రామ’లో రామ్ చరణ్, కియరా అద్వానీ

  ఈ మూవీలో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

  ‘వినయ విధేయ రామ’లో కియారా అద్వానీ, రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటో)

  మరోవైపు బాలీవుడ్ హీరో వివేక్ ఓబరాయ్ ఈ మూవీలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ మూవీతో రామ్ చరణ్ హీరోగా మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

  ఇది కూడా చదవండి 

  No 1 Yaari: అల్లుడితో కలిసి బాలయ్య రచ్చ..కేక పుట్టిస్తోన్న నెం 1 యారీ ప్రోమో

  అప్పుడు స‌మంత‌.. ఇప్పుడు సాయిప‌ల్ల‌వి.. సేమ్ సీన్ రిపీట్..

  వెన్నుపోటు వివాదం.. తెలుగు తమ్ముళ్ళు కుక్కలు అంటున్న వర్మ..

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Boyapati Srinu, Ram Charan, Tollywood