హోమ్ /వార్తలు /సినిమా /

బోయపాటి చెప్పిందే చేస్తున్నాడు.. బాలయ్య కోసం భారీ బడ్జెట్..

బోయపాటి చెప్పిందే చేస్తున్నాడు.. బాలయ్య కోసం భారీ బడ్జెట్..

మే 28న ఎన్టీఆర్ జయంతి. అందుకే ఆరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

మే 28న ఎన్టీఆర్ జయంతి. అందుకే ఆరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

Balakrishna Boyapati Srinu: బాలయ్య గత మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కనీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. అందులో మహానాయకుడు అయితే కనీసం 5 కోట్ల మార్క్ కూడా టచ్ చేయలేదు.

బాలయ్య గత మూడు సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. కనీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేదు. అందులో మహానాయకుడు అయితే కనీసం 5 కోట్ల మార్క్ కూడా టచ్ చేయలేదు. ఇక రూలర్ కూడా 7 కోట్ల లోపే రన్ పూర్తైపోయింది. దాంతో ఇప్పుడు బాలయ్యకు బడ్జెట్ కష్టాలు మొదలైపోయాయి. ఈయనతో సినిమా అంటే ఇప్పుడు కాస్త ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. అందుకే తక్కువ బడ్జెట్‌లో కానివ్వాలని బాలయ్య కూడా నిర్మాతలకు సూచనలు ఇస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈయన బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలతో ఈ కాంబినేషన్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)
బాలకృష్ణ, బోయపాటి శ్రీను (Facebook/Photos)

దాంతో ఇప్పుడు మూడో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోయాయి. అయితే 'వినయ విధేయ రామ' లాంటి డిజాస్టర్ తర్వాత కూడా బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో కాస్త తగ్గుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అందరి మాటలను.. అనుమానాలను ఒక్కటే టీజర్‌తో పటాపంచలు చేసాడు బోయపాటి. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన #BB3 టీజర్ ఇప్పటి వరకు 12 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ యూ ట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది ఈ టీజర్.

బాలకృష్ణ BB3 ఫస్ట్ రోర్ (Youtube/Credit)
బాలకృష్ణ BB3 ఫస్ట్ రోర్ (Youtube/Credit)

అంతే కాకుండా ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దాంతో మరోసారి భారీ బడ్జెట్ పెట్టినా కూడా రికవర్ అవుతుందనే నమ్మకాన్ని అభిమానులతో పాటు నిర్మాతల్లో కలిగించాడు బోయపాటి శ్రీను. పైగా ఇందులో అఘోరాగా కూడా నటిస్తున్నాడు నందమూరి నటసింహం. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు అనుమతులు ఇచ్చినా కూడా కొన్ని రోజులు ఆగాలని సూచిస్తున్నాడు బాలయ్య. బడ్జెట్ విషయంలో కాదు కానీ పని దినాల విషయంలో తగ్గించాలని చెప్తున్నాడు బాలకృష్ణ.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, Boyapati Srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు