మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్‌చరణ్.. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. మంచి హిట్స్ పడటంతో టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు చెర్రీ. కమర్షియల్ విజయాలతో పాటు నటనకు మంచి స్కోప్ ఉన్న రంగస్థలం వంటి సినిమాల్లోనూ నటించి మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వారసత్వాన్ని నిలబెట్టి అభిమానులు ఆనందపడేలా చేస్తున్నాడు. చెర్రీ కెరీర్లోనూ ఫ్లాప్స్ ఉన్నాయి. అయితే రామ్‌చరణ్ (Ram charan) నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడం మెగా అభిమానులు తెగ ఫీలయ్యేలా చేస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్లో మాస్ హిట్స్ అందుకుంటూ తిరుగులేని దర్శకులుగా దూసుకుపోతున్న బోయపాటి శ్రీను, కొరటాల శివ.. రామ్ చరణ్ నటించిన సినిమాలతోనే తమ కెరీర్లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్స్‌ను ఫేస్ చేశారు.
అంతకుముందు వరుస విజయాలతో ఉన్న బోయపాటి శ్రీను(Boyapati Srinu) రామ్ చరణ్‌తో తెరకెక్కించిన వినయ విధేయ రామా సినిమాతో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. అంతకుముందు బెల్లంకొండ శ్రీనివాస్‌తో జయ జానకి నాయక సినిమాతోనూ బోయపాటి ఫెయిల్యూర్‌ను ఫేస్ చేశారు. కానీ అది బెల్లంకొండ శ్రీనివాస్ వంటి చిన్న హీరో సినిమా కావడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ వినయ విధేయ రామ బోయపాటి కెరీర్లో బిగ్ ఫ్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ, వెంకటేశ్, బన్నీ వంటి హీరోలకు భారీ హిట్స్ ఇచ్చిన బోయపాటి.. రామ్ చరణ్ విషయంలో మాత్రం ఎందుకు ఈ రకంగా ఫెయిలయ్యాడో అని ఫ్యాన్స్ బాగా బాధపడిపోయారు.
ఇక ఫస్ట్ మూవీ మిర్చి నుంచి అన్నీ బ్లాక్ బస్టర్సే తెరకెక్కించిన కొరటాల శివ (koratala siva).. ఇటీవల చిరంజీవి, రామ్‌చరణ్ కాంబినేషన్లో తెరకక్కించిన ఆచార్య మూవీ బిగ్ డిజాస్టర్ జాబితాలో చేరిపోయింది. ఆచార్య సినిమాలో మెయిన్ హీరో చిరంజీవే అయినా.. సినిమాలో ముఖ్యమైన పాత్ర మాత్రం రామ్‌చరణ్‌దే. కాబట్టి కొరటాల శివ కూడా బోయపాటి శ్రీను తరహాలోనే రామ్ చరణ్ దగ్గరకు రాగానే బోల్తా కొట్టాడనే గుసగుసలు మొదలయ్యాయి.
సాధారణంగా హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి ఇండస్ట్రీలో సర్వసాధారణం. హీరోలు, దర్శకులకు ఇలాంటి పరాజయాలు అప్పుడప్పుడు చవిచూస్తూనే ఉంటారు. కానీ చాలామంది హీరోలకు హిట్స్ ఇచ్చిన బోయపాటి, కొరటాల శివ రామ్ చరణ్‌తో హిట్ కొట్టలేక చతికలబడటం మెగా అభిమానులు తెగ ఫీలయ్యేలా చేస్తోంది. మరి భవిష్యత్తులో అయినా.. ఈ ఇద్దరు దర్శకులు మళ్లీ రామ్ చరణ్‌తో సినిమాలు చేసి సక్సెస్ కొడతారేమో చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.