బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ కాంబినేషన్ ఓకే.. హీరో ఎవ‌రు స‌ర్..?

వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 18, 2019, 8:13 AM IST
బోయపాటి శ్రీను, అల్లు అరవింద్ కాంబినేషన్ ఓకే.. హీరో ఎవ‌రు స‌ర్..?
అల్లు అరవింద్ బోయపాటి శ్రీను
  • Share this:
వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. సినిమా వ‌చ్చి 7 నెల‌లు గ‌డిచినా కూడా ఆయ‌న్ని స్టార్ హీరోలు ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఓ నిర్మాత నుంచి బోయ‌పాటికి అండ వ‌చ్చింది. ఆయ‌నే అల్లు అరవింద్.. తాజాగా కార్తికేయ న‌టించిన గుణ 369 ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌కు వ‌చ్చిన అల్లు అర‌వింద్.. బోయ‌పాటితో సినిమా చేస్తాన‌ని మాటిచ్చాడు.
Boyapati Srinu, Allu Aravind movie confirmed after the success of Sarrainodu but no clarity on Hero pk.. వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. boyapati srinu,boyapati srinu twitter,allu aravind,allu aravind twitter,allu arjun,boyapati sreenu,boyapati srinu movies,boyapati srinu new movie,boyapati srinu speech,allu aravind boyapati srinu,allu aravind about guna 369 movie,allu arjun and boyapati srinu movie title,allu arjun speech,allu aravind & boyapati byte,boyapati srinu byte about sarrainodu success,boyapati srinu interview,boyapati srinu hit movies,telugu cinema,బోయపాటి శ్రీను,అల్లు అరవింద్,బోయపాటి శ్రీను అల్లు అరవింద్,సరైనోడు బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
అల్లు అరవింద్ బోయపాటి శ్రీను

త్వరలోనే త‌మ బ్యానర్‌లో బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తానని అల్లు అరవింద్ ప్రకటించాడు. ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది అయినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అనుకోని కార‌ణాల‌తో ఆల‌స్యం అవుతూ వ‌చ్చింద‌ని చెప్పాడాయ‌న‌. అయితే ఇందులో హీరో ఎవ‌ర‌నే విష‌యంపై మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు ఈ మెగా నిర్మాత‌. త‌మ సంస్థ‌కు ఇప్ప‌టికే ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చిన బోయ‌పాటి.. మ‌రో హిట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని ధీమాగా చెబుతున్నాడు ఈయ‌న‌.

Boyapati Srinu, Allu Aravind movie confirmed after the success of Sarrainodu but no clarity on Hero pk.. వినయ విధేయ రామ సినిమా దారుణంగా ప్లాప్ అయిన త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించ‌లేక‌పోయాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్ర ఫ‌లితం ప్ర‌భావం ఇప్ప‌టికీ బోయ‌పాటిపై అలాగే ఉంది. boyapati srinu,boyapati srinu twitter,allu aravind,allu aravind twitter,allu arjun,boyapati sreenu,boyapati srinu movies,boyapati srinu new movie,boyapati srinu speech,allu aravind boyapati srinu,allu aravind about guna 369 movie,allu arjun and boyapati srinu movie title,allu arjun speech,allu aravind & boyapati byte,boyapati srinu byte about sarrainodu success,boyapati srinu interview,boyapati srinu hit movies,telugu cinema,బోయపాటి శ్రీను,అల్లు అరవింద్,బోయపాటి శ్రీను అల్లు అరవింద్,సరైనోడు బోయపాటి శ్రీను,తెలుగు సినిమా
అల్లు అరవింద్ బోయపాటి శ్రీను

మూడేళ్ల కింద ఈ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌రైనోడు మంచి విజ‌యం సాధించింది. అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారి 70 కోట్ల మార్క్ అందుకున్న సినిమా ఇది. ఇప్పుడు మ‌రోసారి ఈ కాంబినేష‌న్ రిపీట్ కానుంది. అయితే ఇప్ప‌టికే బాల‌య్య‌తో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు బోయ‌పాటి శ్రీను. ఈ చిత్రం ఎప్పుడు మొద‌ల‌వుతుంది.. అస‌లు మొద‌ల‌వుతుందా లేదా అనే విష‌యంపై ఇంకా త‌ర్జ‌న‌భ‌ర్జ‌న జ‌రుగుతుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ మాస్ ద‌ర్శ‌కుడి త‌ర్వాతి సినిమా ఎలా ఉండ‌బోతుందో..?

First published: July 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు