హోమ్ /వార్తలు /సినిమా /

బాలయ్య కోసం బాంబే భామ.. బోయపాటి సినిమాలో రచ్చే..

బాలయ్య కోసం బాంబే భామ.. బోయపాటి సినిమాలో రచ్చే..

మే 28న ఎన్టీఆర్ జయంతి. అందుకే ఆరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

మే 28న ఎన్టీఆర్ జయంతి. అందుకే ఆరోజు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.

BB3: బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ రోర్ అదిరిపోయింది. అది చూసిన తర్వాత సినిమాపై అంచనాలు కూడా..

బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ రోర్ అదిరిపోయింది. అది చూసిన తర్వాత సినిమాపై అంచనాలు కూడా తారాస్థాయికి చేరిపోయాయి. ముఖ్యంగా ఈ చిత్రంతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ విజయం సాధించడంతో హ్యాట్రిక్ పూర్తి చేయాలని చూస్తున్నారు ఇద్దరూ. మరోవైపు బాలయ్యకు కూడా గతేడాది ఏం కలిసిరాలేదు.

బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)
బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)

2019లో ఆయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, రూలర్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఈ మూడు సినిమాలు బాలయ్య మార్కెట్‌కు భారీగానే గండి కొట్టాయి. కనీసం 10 కోట్లు కూడా వసూలు చేయలేక బాలయ్య ఇమేజ్‌ను ప్రశ్నించాయి.. ఆయన భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసాయి. ఇలాంటి సమయంలో బోయపాటి శ్రీను సినిమాను భారీ బడ్జెట్‌తోనే నిర్మిస్తున్నాడు మిర్యాల రవీందర్ రెడ్డి.

బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)
బాలకృష్ణ,బోయపాటి శ్రీను (Twitter/balakrishna boyapati)

గతంలో బోయపాటితో జయ జానకీ నాయక సినిమాకు పని చేసాడు రవీందర్ రెడ్డి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు అనుకున్నారు. శ్రీయ, నయనతారతో ప్రియమణి లాంటి సీనియర్ హీరోయిన్‌ల పేర్లు పరిశీలించిన తర్వాత ఒక్కరు కూడా సెట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు కొత్తమ్మాయిని ఫైనల్ చేసాడు బోయపాటి శ్రీను.

BB3లో మరోసారి రెండు పాత్రల్లో బాలకృష్ణ (Twitter/Photo)
BB3లో మరోసారి రెండు పాత్రల్లో బాలకృష్ణ (Twitter/Photo)

బాలయ్య కోసం ప్రత్యేకంగా బాంబే నుంచి భామను దించేసాడు ఈయన. ఆమెతోనే BB3లో రొమాన్స్ చేయబోతున్నాడు బాలకృష్ణ. కొత్తమ్మాయితో బాలయ్య జోడీ కచ్చితంగా అదిరిపోతుందని చెప్తున్నాడు బోయపాటి. ఈ మధ్యే 60ల్లోకి ఎంట్రీ ఇచ్చినా కూడా డాన్సులు, రొమాన్స్ విషయంలో మాత్రం బాలయ్య ఇంకా 20ల్లోనే ఆగిపోయాడు. బోయపాటి సినిమా కూడా దీనికి మినహాయింపు కాదంటున్నాడు బాలయ్య. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Balakrishna, BB3, Boyapati Srinu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు