హోమ్ /వార్తలు /సినిమా /

Akhanda 1st day WW collections: ‘అఖండ’ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోసిన బాలకృష్ణ..

Akhanda 1st day WW collections: ‘అఖండ’ ఫస్ట్ డే ఏరియా వైజ్ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ను ఊచకోత కోసిన బాలకృష్ణ..

6. అఖండ:
హీరో: బాలకృష్ణ నందమూరి, దర్శకుడు: బోయపాటి శ్రీను, ఫస్ట్ డే ఇండియన్ గ్రాస్: 29.80 కోట్లు

6. అఖండ: హీరో: బాలకృష్ణ నందమూరి, దర్శకుడు: బోయపాటి శ్రీను, ఫస్ట్ డే ఇండియన్ గ్రాస్: 29.80 కోట్లు

Akhanda 1st day WW collections: వామ్మో.. వామ్మో ఏందీ అరాచకం..? కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత చూసిన తర్వాత ఎవరైనా ఇదే అనాల్సిందే. బోయపాటి (Akhanda 1st day WW collections) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ సినిమా తొలిరోజు కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు షాక్ అవుతున్నారు.

ఇంకా చదవండి ...

వామ్మో.. వామ్మో ఏందీ అరాచకం..? కరోనా సెకండ్ వేవ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర బాలయ్య ఊచకోత చూసిన తర్వాత ఎవరైనా ఇదే అనాల్సిందే. టికెట్ రేట్లు తగ్గించారు.. కరోనా నిబంధనలు పాటించమన్నారు.. ఇన్ని ఆంక్షలున్నా చూడా బాలయ్య మాత్రం మామూలుగా రచ్చ చేయలేదు. బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా తొలిరోజు కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతరం చూపించాడు. తొలిరోజు అన్నిచోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు పడటమే కాదు.. చాలా చోట్ల రికార్డులు కూడా తిరగరాసాడు బాలయ్య. చాలా రోజుల తర్వాత.. ఇంకా మాట్లాడితే చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది.

రూలర్, ఎన్టీఆర్ మహానాయకుడు లాంటి సినిమాలు క్లోజింగ్ కలెక్షన్స్‌లో కూడా కనీసం 10 కోట్లు షేర్ తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అఖండ మాత్రం అద్భుతం చేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అఖండ. ఈ జాతర చూసిన తర్వాత అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య బాక్సాఫీస్ స్టామినా తగ్గిపోయిందని కామెంట్ చేసిన వాళ్లకు అఖండ సినిమాతో దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా తొలిరోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ ఓసారి చూద్దాం..

Bhumika Chawla: స్విమ్మింగ్ పూల్‌లో భూమిక చావ్లా.. 43 ఏళ్ళ వయసులో హాట్ ఫోటోలు వైరల్..


నైజాం: 4.39 కోట్లు

సీడెడ్: 4.02 కోట్లు(72 లక్షల హైర్స్)

ఉత్తరాంధ్ర: 1.36 కోట్లు

ఈస్ట్: 1.05 కోట్లు(31 లక్షల హైర్స్)

వెస్ట్: 0.96 కోట్లు(24 లక్షల హైర్స్)

గుంటూరు: 1.87 కోట్లు (1 కోటి హైర్స్)

కృష్ణా: 0.81 కోట్లు

నెల్లూరు: 0.93 కోట్లు

ఏపీ-తెలంగాణ టోటల్: 15.39 కోట్లు (23 కోట్లు గ్రాస్) (2.37 కోట్లు హైర్స్)

కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా: 1.00 కోట్లు

ఓవర్సీస్: 2.35 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్: 18.74 కోట్లు (29.5 కోట్లు గ్రాస్)

Vakeel Saab - Uppena - Tuck Jagadish: 2021లో అత్యధిక TRP వచ్చిన 12 సినిమాలు ఇవే.. లిస్టులోకి నాని ‘టక్ జగదీష్’ ఎంట్రీ..


అఖండ సినిమాకు 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలిరోజు 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. రెండో రోజు కూడా చాలా చోట్ల అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చుకుంటుంది. 4 రోజుల వీకెండ్ కావడంతో కచ్చితంగా ఊచకోత ఖాయంగా కనిపిస్తుంది.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Akhanda movie, Box Office Collections, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు